విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నారప్ప కాగా మరొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 మూవీ. కాగా వీటిలో నారప్ప మూవీ ని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా ఎఫ్3 మూవీ ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఇందులో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా మరొక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే నారప్ప చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా ఎఫ్3 కూడా వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. అసలు మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల తమిళ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ కొట్టిన అసురన్ మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప మూవీ లో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. వెంకటేష్ ఇందులో యాక్షన్ తో కూడిన మాస్ పాత్ర చేస్తుండగా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

గతంలో సూపర్ స్టార్ మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం సినిమాతో ఊహించని విధంగా భారీ పరాజయాన్ని మూటగట్టుకుని కొన్నాళ్ల పాటు టాలీవుడ్ కి దూరమైన శ్రీకాంత్ అడ్డాల, ఎట్టకేలకు వెంకీ తో తీస్తున్న నారప్ప తో తప్పకుండా భారీ సక్సెస్ హిట్ కొట్టి మళ్ళి టాలీవుడ్ లో దర్శకుడిగా పెద్ద బ్రేక్ ని అందుకుంటానని అంటున్నరారట. మరోవైపు ఈ మూవీ సక్సెస్ పై యూనిట్ కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మే 14న సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న నారప్ప మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: