టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంకా అదృష్టంతో పోరాడుతూనే ఉంది.. ఆమెకు ఎంతో టాలెంట్ ఉన్నా లక్ మాత్రం కలిసి రావట్లేదు. ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ కాకపోవడంతో ఆమెకు ఏదీ కలిసి రావట్లేదు.. యంగ్ హీరోలతో చేస్తున్నా ఆమెకు పెద్ద హీరోలతో సినిమా ఛాన్స్ లు రావట్లేదు. వచ్చినా అవి హిట్ కావట్లేదు. దాంతో ఆమె మళ్ళీ యధాస్థానానికి వచ్చి ఆగిపోతుంది. ముందునుంచి సాంప్రదాయ బద్ధమైన పాత్రలు చేయడానికి ఇష్టపడే లావణ్య ఈమధ్యే గ్లామర్ పాత్రలు పోషించడం కూడా ప్రారంభించింది..

ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఏ రేంజ్ లో చూపించిందో అందరికి తెలిసిందే.. దీంతో ఈ ముద్దుగుమ్మ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అందరు తెగ ఆశ్చర్యపోయారు. కెరీర్ బిగినింగ్ నుంచి ఆమె ఇంతలా ఎక్స్పోజ్ చేసిన సందర్భాలు లేవు. ఇక తాజాగా ఆమె నటించిన A1 ఎక్స్ ప్రెస్ సినిమాలో కూడా ఆమె హద్దులు దారి గ్లామర్ ని ప్రదర్శించింది అని తెలుస్తుంది. ..అంతేకాకుండా మూవీలో లిప్ లాక్ సీన్ లోకూడా నటించారని ప్రచారం జరుగుతుంది. సందీప్ కిషన్, లావణ్య ఏ వన్ ఎక్స్ ప్రెస్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా... లావణ్య హీరో సందీప్ కి లిప్ లాక్ పెట్టినట్లు ఓ సన్నివేశం ఉంది .

ఇకపోతే మార్చి 5న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ‌త రాత్రి ఘ‌నంగా నిర్వ‌హించ‌గా, ఈ వేడుక‌కు రామ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే వేడుక చివ‌ర‌లో స్టేజ్‌ పైకి వ‌చ్చిన లావ‌ణ్య త్రిపాఠి, సందీప్ కిష‌న్‌ను అన్నా అనేసి అంద‌రిని ఆశ్చర్యానికి గురి చేసింది.  స్టేజ్‌పైన మాట్లాడిన లావ‌ణ్య త్రిపాఠి, A1 ఎక్స్ ప్రెస్ నా మనసుకు బాగా నచ్చిన చిత్రం.ఈ కథ వినగానే చాలా కొత్తగా అనిపించి, వెంటనే ఓకే చెప్పేశాను. ఈ మూవీ కోసం నేను హాకీ కూడా నేర్చుకున్నాను. కోవిడ్ టైములో చాలా కష్టాలు పడి చిత్రాన్ని పూర్తి చేశాము. సందీప్ అన్నా గురించి చెప్పాలంటే అంటూ నాలుక కురుచుకుంది. వెంట‌నే సందీప్ మీకు అన్నా, నాకు మంచి ఫ్రెండ్ అంటూ క‌వ‌ర్ చేసింది. లావ‌ణ్య మాట‌ల‌తో అంద‌రి ముఖాల‌లో న‌వ్వులు పూశాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: