బాలీవుడ్ భామ పరిణితి చోప్రా కెరియర్ మళ్లీ ట్రాక్ ఎక్కినట్టే ఉంది. ఒకప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న అమ్మడు మధ్యలో కొన్నాళ్లు ట్రాక్ తప్పేసింది. ఇక మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంటుంది. అమ్మడు లేటెస్ట్ గా నటించిన ది గర్ల్ ఆన్ ది ట్రైన్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా పరిణితి ఫ్యాన్స్ ను మెప్పించింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డు యు రిమెంబర్ అనే కాన్సెప్ట్ తో సోషల్ మీడియా చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా ఓ కొంటె ప్రశ్నకు సమాధానం ఇచ్చేసింది అమ్మడు. మీ తొలి ముద్దు అనుభవం ఏ ఏట జరిగిందని అడిగితే.. పరిణితి ఎలాంటి మొహమాటం లేకుండా 18 ఏళ్లకే అనేసింది. తనకు సైఫ్ ఆలి ఖాన్ అంటే ఇష్టమని చెప్పిన పరిణితి ఇప్పటివరకు ఎవరితో డేటింగ్ చేయలేదని అంటుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఆడియెన్స్ హాట్ బ్రేక్ చేసిన చోప్రా సిస్టర్ ఇప్పుడు తిరిగి మళ్లీ అదే ఫాం తెచ్చుకోవాలని చూస్తుంది.

ఈమధ్య పరిణీతి కూడా సౌత్ సినిమాల మీద కన్నేస్తుందని అన్నారు. ఆమె తెలుగులో చేయకపోయినా పరిణితికి తెలుగులో కూడా క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అలియాకు బదులుగా ముందు పరిణితిని అడిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ భామలకు తెలుగు సినిమా ఆఫర్ వచ్చినా ఇక్కడ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇస్తారు. అందుకే వీరికి ఇక్కడ అవకాశాలు రావట్లేదు. ఖాళీగైనా ఉంటారు కాని సౌత్ సినిమాలు మాత్రం చేయరు బాలీవుడ్ భామలు. కొందరు మాత్రం తెలివిగా ఇక్కడ అక్కడ చేసేస్తారు.                               
 

మరింత సమాచారం తెలుసుకోండి: