2022 సంక్రాంతికి ఇప్పటి నుండే సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సర్కారు వారి పాట సినిమా 2022 సంక్రాంతి రిలీజ్ ఎనౌన్స్ చేయగా.. ఈ సినిమాతో పాటుగా లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో వస్తున్న హర హర వీరమల్లు (వర్కింగ్ టైటిల్) సినిమాను కూడా 2022 సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నారు.

పవన్, మహేష్ బాక్సాఫీస్ ఫైట్ చాలా రసవత్తరంగా సాగనుంది. వీరిద్దరి పోటీనే క్రేజీగా అనుకుంటుంటే వీరి మధ్యలోకి తన సినిమా తీసుకురావాలని చూస్తున్నాడు కింగ్ నాగార్జున. త్వరలో వైల్డ్ డాగ్ గా రాబోతున్న నాగ్ తన నెక్స్ట్ సినిమా బంగార్రాజుని త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. కథలో కొన్ని కొన్ని మార్పులతో సినిమా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా ప్రీ క్వెల్ గా ఈ సినిమా వస్తుంది.

ఈ సినిమాను 2022 సంక్రాంతికి తెచ్చేలా.. సోగ్గాడి సెంటిమెంట్ ఈ ప్రీక్వెల్ సినిమాకు కలిసి వచ్చేలా నాగార్జున అదిరిపోయే స్కెచ్ వేశాడు. సోగ్గాడు టైం లో కూడా సంక్రాంతికి కలక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ బంగార్రాజు కూడా అదే రేంజ్ హిట్ కొడితే మాత్రం నాగార్జున మళ్లీ తిరిగి హిట్ ఫాం లోకి వచ్చినట్టే లెక్క. నాగ్ వైల్డ్ డాగ్ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది.                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: