తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు, ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక పరిశ్రమలో ఓ హీరో కోసం అనుకున్న టైటిల్ మరో హీరోకు వెళ్లడం కామన్. అలా ఎన్నో టైటిల్స్ ఒకరి చేతుల్లోంచి మరొకరికి వెళ్లిపోయాయి. కాటమరాయుడు అప్పట్లో కమెడియన్ సప్తగిరి రిజిష్టర్ చేయించుకున్నాడు.

అయితే పదేళ్ళ కింద దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా గుర్తుంది కదా..? డార్లింగ్ లాంటి క్లాస్ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమా మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్. అయితే ఈ సినిమా టైటిల్ వెనక ఆసక్తికరమైన కథ ఉంది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ 30 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఆ సమయానికి అదే.

ఇక మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా కథపై మహేష్ చాలా ఆసక్తి చూపించాడు. మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ అనుకుని RR మూవీ మేక‌ర్స్ రిజిష్టర్ చేయించారు. భారీ బడ్జెట్‌తో ఆ సినిమాను నిర్మించడానికి ఆర్ఆర్ మూవీ మేకర్స్ ప్లాన్ చేసారు. ఈ సినిమా కోసం అప్పట్లో మహేష్ బాబుకి 2.5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే అదే సమయంలో RR మూవీ మేక‌ర్స్‌కు ఆర్థిక ఇబ్బందులు రావడంతో సినిమా ఆగిపోయింది. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ మాత్రం అలాగే ఉండిపోవడంతో స్వయంగా ఈ టైటిల్‌ తనకు కావాలని నిర్మాత వెంకట్‌ను ప్రభాస్ కోరాడు. దాంతో ఆయన కూడా కాదనకుండా ఇచ్చేసాడు.

అయితే దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా వచ్చి విజయం సాధించింది. RR మూవీ మేకర్స్‌తో తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేసాడు మహేష్ బాబు. కానీ మాటిచ్చాడు కాబట్టి 2012లో అదే నిర్మాణ సంస్థకు బిజినెస్ మేన్ సినిమా చేసాడు. మరోవైపు మహేష్ బాబు సినిమా ఆగిపోయిన తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఊస‌ర‌వెల్లిని మొదలు పెట్టాడు. ఇక్కడ విశేషం ఏంటంటే మహేష్ కోసం సురేందర్ రెడ్డి రాసుకున్న మాఫియా స్టోరీ ఇప్పటికీ అలాగే ఉంది. మరి ఎప్పటికైనా ఆ సినిమా వస్తుందో రాదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: