టాలీవుడ్ హీరోయిన్ సమంత టాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.. అయితే పెళ్లి తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గాయి..  ఏ మాయ చేశావే చిత్రంతో అందరిని మాయ చేసిన సమంతసినిమా తర్వాత ఆమెకు చాలా క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటుతున్నా సమంత కి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. దీనికి తోడు అక్కినేని కోడలై వారి ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా సంపాదించింది.

చాల తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత పెళ్లి కాకముందే పెద్ద స్టార్.. అయితే చాలామంది హీరోయిన్ లు పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు, షో లు చేస్తూ అందరిని అలరిస్తుంది. ది ఫామిలీ మెన్ సిరీస్ తో ఆమె OTT రంగ ప్రవేశం చేస్తుంది. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటిస్తోంది.త్వరలోనే స్ట్రీమ్ కాబోతుంది. మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న దీనిని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కించారు.

అయితే ఆమె తాజాగా ఆమె ఫస్ట్ లవ్ గురించి నోరు విప్పింది. ప్రస్తుతం సమంత చెన్నై వీధుల్లో తిరుగుతోంది. అలా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అంతే కాకుండా చిన్నప్పుడు తన బాల్కనీ నుంచి ఓ కొండను చూస్తూనే ఉండేదట. తన విషయాలన్నీ ఆ కొండకు మాత్రమే తెలుసట. సమంత తన చిన్న నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో పల్లవరం కొండను చూపించి దాని విశిష్టతను చెప్పుకొచ్చింది. ఈ పరీక్షల రోజు ఉదయం నేను ఎలా ఉండేదాన్ని.. ఎంతో మంది దేవుళ్లకు ఎన్నో రకాలు మొక్కిన మొక్కులు, చేసిన ప్రామీస్‌లు. దానికే తెలుసు.. కానీ నేను వాటిని ఎప్పుడూ నెర వేర్చలేదనుకోండి.. నా ఫస్ట్ లవ్.. నా హార్ట్ బ్రేక్.. నా స్నేహితుల మరణం.. నా కన్నీళ్లు.. వీడ్కోలు.. ఇళా అన్నీ కూడా దానికే తెలుసు. అందుకే ఈ పోస్ట్ చేయడానికి ఆ కొండకు అన్నీ రకాల అర్హతలున్నాయంటూ సమంత ఎమోషనల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: