ఇటీవల రూలర్, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా బిబి3. అతి త్వరలో అఫీషియల్ టైటిల్ అనౌన్స్ కానున్న ఈ మూవీని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా మంచి స్పందన దక్కించుకుంది. బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ లో సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ విలన్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. గతంలో బాలయ్య, బోయపాటి ల కాంబో లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీస్ గా తెరకెక్కి సూపర్ హిట్స్ దక్కించుకున్నాయి. అయితే ప్రస్తుతం తామిద్దరి కలయికలో వస్తున్న ఈ మూడవ మూవీ కూడా భారీ సక్సెస్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేసేలా దర్శకుడు బోయపాటి దీనిని ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారని, మరీ ముఖ్యంగా ఇందులో మాస్ ప్రేక్షకులు ఆశించే ఫైట్స్, యాక్షన్ సీన్స్ అయితే అదరహో అనే రేంజ్ లో ఉండనున్నాయట. 

బాలయ్య ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తో పాటు మధ్యలో వచ్చే ఒక భారీ ఛేజింగ్ సీన్ సూపర్బ్ గా ఉండనున్నాయని, తప్పకుండా రిలీజ్ తరువాత భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునే ఈ మూవీ మామూలు జాతర కాదు మాస్ ఆడియన్స్ కి మంచి జాతర వంటి మూవీ అని అంటున్నారు. మొత్తంగా చూస్తుంటే బాలయ్య, బోయపాటి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ భారీ సక్సెస్ కొట్టే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు పలువురు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: