‘కేజీఎఫ్ 2’ కు ఏర్పడ్డ క్రేజ్ తో ఆమూవీ బిజినెస్ ను ‘బాహుబలి 2’ బిజినెస్ స్థాయిని మించి చేయాలని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నారు. ఈమూవీ ఈసమ్మర్ రేస్ కు విడుదలకాబోతున్న పరిస్థితులలో ఈమూవీ బిజినెస్ కు ప్రభాస్ మ్యానియాను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


ఎవరు ఊహించని విధంగా ఈమూవీ విడుదల తేదీని సుమారు 14 నెలల ముందు ప్రకటించడం ఇండస్ట్రీ వర్గాలలో కనివినీ విషయంగా మారింది. ఒక సినిమా విడుదల తేదీని 3 నెలల ముందు ప్రకటిస్తారు లేదంటే 6 నెలల ముందు ప్రకటిస్తారు. అయితే ఈతీరుకు భిన్నంగా ఎవరు ఊహించని విధంగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల ‘సలార్’ మూవీ రిలీజ్ డేట్ ఏప్రియల్ 2022 అని ప్రకటించడం వెనుక ‘కేజీఎఫ్ 2’ మార్కెటింగ్ వ్యూహాలు ఉన్నాయి అని అంటున్నారు.



తెలుస్తున్న సమాచారం మేరకు ‘కేజీఎఫ్ 2’ నిర్మాతలు తమ సినిమాను బయ్యర్లకు అమ్మడంలేదు. కేవలం రిటర్నబుల్ అడ్వాన్స్ లు భారీస్థాయిలో అడుగుతున్నట్లు టాక్. ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమూవీకి సంబంధించి కేవలం నైజాం ఏరియాకే 50 కోట్ల అడ్వాన్స్ అడుగుతున్నారని అంటున్నారు. ఈస్థాయిలో అడ్వాన్స్ లు ఇవ్వాలి అంటే ‘కేజీఎఫ్ 2’ ‘బాహుబలి 2’ ని మించిన బ్లాక్ బష్టర్ హిట్ కావాలి.


ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో బ్లాక్ బష్టర్ హిట్ కావడం జరగని పని అని చాలామంది బయ్యర్లు భావిస్తూ ఉండటంతో ఈ రేంజ్ లో భారీ అడ్వాన్స్ లు ఇవ్వడానికి చాలామంది భయపడుతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో బయ్యర్లలో నమ్మకం ధైర్యం కలిగించడానికి ప్రభాస్ ‘సలార్’ మూవీని అడ్డుగా పెట్టుకుని ‘కేజీఎఫ్ 2’ మూవీకి సంబంధించి బయ్యర్లకు నష్టాలు వస్తే ఆ నష్టాలకు సంబంధించి ‘సలార్’ మూవీ రైట్స్ ఇవ్వడం ద్వారా ‘కేజీఎఫ్ 2’ బయ్యర్లకు న్యాయం చేస్తామని ధైర్యం కలిగించే వ్యూహంలో భాగంగా ఇలా 14 నెలలు ముందుగా సాలార్ డేట్ ను ప్రకటించారు అంటు ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..  




మరింత సమాచారం తెలుసుకోండి: