యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దశరథ్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా టైటిల్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ లేటెస్ట్ గా లీక్ అయ్యింది. మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ ప్రభాస్ ది కాదట. మహేష్ సినిమా కోసం అనుకున్న టైటిల్ ను ప్రభాస్ కోసం వాడేశారట.

సూపర్ స్టార్ మహేష్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఓ సినిమా అనుకున్నారు. ఆ సినిమాకు టైటిల్ గా మిస్టర్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ చేశారట. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ ఈ సినిమా చేయాలని చూశారు. టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. అయితే అప్పుడే ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అప్పుల్లో చిక్కుకోవడం వల్ల సినిమా ఆగిపోయింది. మహేష్ కు ఆర్.ఆర్ మేకర్స్ ఇచ్చిన 2 కోట్ల అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడట.

ఇక ఎలాగు సినిమా క్యాన్సిల్ అయ్యిందని దిల్ రాజు టైటిల్ అడిగితే మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే సురేందర్ రెడ్డి, మహేష్ కాంబోలో అనుకున్న ఆ మాఫియా కథ ఇంతవరకు ఎవరితో తీయలేదట. ఎప్పటికైనా అది మహేష్ తోనే తీస్తానని అంటున్నాడట సురేందర్ రెడ్డి. మొత్తానికి మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ వెనక ఇంత పెద్ద స్టోరీ నడిచింది అన్నమాట. తప్పకుండా మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ తో మహేష్ సినిమా వస్తే ఆ లెక్క వేరేలా ఉండేది. మహేష్ తో ఆల్రెడీ 2007లోనే అతిధి మూవీ చేశాడు సురేందర్ రెడ్డి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.                           

మరింత సమాచారం తెలుసుకోండి: