‘సాహో’ తో కోరుకున్న బ్లాక్ బష్టర్ హిట్ దక్కక పోవడంతో ప్రభాస్ ‘రాథే శ్యామ్’ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈమూవీ విడుదల అనేక వాయిదాల తరువాత జూలై 30కి తన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే ఈసినిమా అంచనాలకు మించి బడ్జెట్ పెరిగి ఖర్చుపెరగడంతో ఈమూవీ విజయం గురించి ప్రభాస్ టెన్షన్ పడుతున్నాడు అన్నవార్తలు హడావిడి చేస్తున్నాయి.


ఈమూవీ టీజర్ కు తెలుగురాష్ట్రాలలో స్పందన బాగానే వచ్చినా బాలీవుడ్ మీడియా మాత్రం ఈమూవీ టీజర్ పై అదేవిధంగా ఈమూవీలోని ప్రభాస్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తోంది. అయినప్పటికీ ఈమూవీ తమ అంచనాల ప్రకారం బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి ఊహించని విధంగా అలియా భట్ గ్రహణంగా మారడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అలియా భట్ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ గంగూబాయ్ కతియావాడి మూవీ వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 1950 ప్రాంతంలో ముంబాయ్ నగరంలో మోసపోయి ఒక వేశ్య గృహానికి అమ్ముడిపోయిన ఒక అమాయకమైన అమ్మాయి కథ ఈమూవీ.



అయితే ఆతరువాత ఆమె పరిస్థితులను ఎదిరించి ఏకంగా అనేకమంది వేశ్యలకు విముక్తి కలిగించడమే కాకుండా 1950 ప్రాంతంలో ఆనాటి మాఫియాను అదేవిధంగా రాజకీయ వేత్తలను ఒక ఆట ఆడుకున్న గంగూబాయ్ పాత్రలో అలియా భట్ నటిస్తోంది. ఈమధ్యనే విడుదలైన ఈమూవీ టీజర్ కు విపరీతమైన స్పందనతో పాటు ప్రశంసలు కూడ వస్తున్నాయి. ఇప్పటికీ ముంబాయ్ ప్రాంతంలోని కొంతమంది వేశ్యల ఇళ్ళల్లో గంగూబాయ్ ఫోటోలు తమ పూజా మందిరాలలో దేవతగా ఆరాదిస్తూ ఉంటారు. అలాంటి వాస్తవ సంఘటనలతో పవర్ ఫుల్ గా నిర్మించిన ఈచిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ నిర్మాణంలో తెరకెక్కించారు.


ఈమూవీలో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈమూవీని ‘రాధే శ్యామ్’ విడుదల అవుతున్న జులై 30న విడుదల చేస్తూ ఉండటంతో ‘రాథే శ్యామ్’ కు కష్టాలు తప్పవు అని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. క్రేజ్ విషయంలో పోల్చుకుంటే బాలీవుడ్ లో ప్రభాస్ కంటే అలియా భట్ మ్యానియా ఎక్కువ. ఇలాంటి పరిస్థితులలో అలియా భట్ వల్ల ప్రభాస్ కార్నర్ అయ్యే ఆస్కారం ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: