గత ఏడాది మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే సినిమాలో నాని నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నానికి పెద్దగా కలిసి రాలేదు. ఆ సినిమా తర్వాత ఆయన పలు సినిమాలు ఒప్పుకుని వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఏవైనా ఉన్నాయి అంటే ఒకటి శ్యామ్ సింగరాయ్ కాగా మరొకటి అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి అనే సినిమా సూపర్ హిట్ కావడంతో వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా మొన్నీ మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడని టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. అది కూడా ఈ సినిమాలో జగపతి బాబు నానికి అన్నగా నటిస్తున్నట్లు చూపించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి జగపతిబాబు క్యారెక్టర్ ఇంకా కాస్త డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టీజర్ ప్రకారం ఈ సినిమాలో ఆయనను ఒక మంచితనం మూర్తీభవించిన మనిషి గా చూపించినా సరే ఈ సినిమాలో జగపతి బాబు ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. సినిమా మొత్తానికి అదే ట్విస్ట్ అని కూడా చెబుతున్నారు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి అలాగే హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 23వ తారీఖున రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: