స్టార్ కమెడియన్ కమ్ హీరో ఈమధ్య విలన్ గా కూడా తన టాలెంట్ చూపిస్తున్న సునీల్ అన్ని చేసేస్తున్నారు. ఓ పక్క కమెడియన్ రోల్స్ చేస్తూనే హీరోగా వచ్చిన అవకాశాలను మిస్ అవకుండా చూసుకుంటున్నారు. సునీల్ హీరోగా కనబడుటలేదు సినిమా ఈమధ్యనే పోస్టర్ వదిలారు. దానితో పాటుగా సునీల్ తో మనసంతా నువ్వే సినిమా డైరక్టర్ వి.ఎన్ ఆదిత్య చేస్తున్న సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. మర్యాద కృష్ణయ్య టైటిల్ తో ఈ సినిమా వస్తుంది.

రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న సినిమా సెంటిమెంట్ తో సునీల్ కు ఈ టైటిల్ పెట్టి ఉండొచ్చని అనుకుంటున్నారు. సునీల్ బర్త్ డే నాడు సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటు పోస్టర్ కూడా వదిలారు. సినిమాలో సునీల్ దొంగగా కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. అదేదో గజదొంగగా కాదు చిలిపి దొంగ అదే కృష్ణుడిలా అన్నమాట. అందుకే ఈ సినిమాకు మర్యాద కృష్ణయ్య అని టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సలోనిని ఫిక్స్ చేశారని టాక్. మర్యాద రామన్న సెంటిమెంట్ లో భాగంగా మర్యాద కృష్ణయ్యకు అదే హీరోయిన్ రిపీట్ చేస్తున్నారు.

సో మొత్తానికి సునీల్ హీరోగా మళ్లీ ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యాడు. వి.ఎన్ ఆదిత్య కూడా చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆయనకు కూడా మంచి హిట్ అందించాలని ఆశిద్దాం. ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మిస్తున్నారు. సునీల్ హీరోగా చేస్తూనే కమెడియన్, విలన్ పాత్రలకు సైన్ చేస్తున్నాడు. హీరోగా మారాక కెరియర్ లో వచ్చిన ఈ గ్యాప్ ను కవర్ చేయాలని చూస్తున్నారు సునీల్.                               

మరింత సమాచారం తెలుసుకోండి: