సైబ‌ర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కొత్త కొత్త ప‌ద్ద‌తుల్లో కేటుగాళ్లు అమాయ‌కుల‌ను మోసం చేస్తునే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సైబ‌ర్ పోలీసులు ఎన్నో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ అమాయ‌కులు మోస‌పోతూనే ఉన్నారు. మ‌రోవైపు సాధార‌ణ ప్ర‌జలే కాకుండా ఉన్న‌త విధ్యావంతుభ‌లు ప్ర‌ముఖులు, సెల‌బ్రెటీలు సైతం సైబ‌ర్ నేరాగాళ్ల చేతిలో మోస‌పోతుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల సైబ‌ర్ నేరగాళ్ల వ‌ల‌లో చిక్కి మోస‌పోయారు. వెంకీ ద‌ర్శ‌కత్వం వ‌హించిన భీష్మ సినిమాకు అవార్డుల పేరుతో కేటుగాళ్లు ఆయ‌న‌కు టోపీ పెట్టారు. ‌వెంకీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భీష్మ సినిమాకు అంత‌ర్జాతీయ పురస్కారంతో పాటు..ప‌లు అవార్డులు వ‌చ్చాయ‌ని రెండు రోజుల క్రితం ఆయ‌కు ఫోన్ కాల్ వ‌చ్చింది. ఒక్కో అవార్డు ప్రాసెసింగ్ నిమిత్తం రూ.10 వేలు ఇవ్వాల‌ని నేర‌గాడు కోర‌డంతో మొత్తం 63 రూపాయ‌ల‌ను వెంకీ నేర‌గాడి అకౌంట్ కు ట్రాన్ఫర్ చేశాడు .

ఆ త‌ర‌వాత తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించాడు. దాంతో వెంట‌నే హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసులను ఆశ్ర‌యించి జ‌రిగిన దానిపై ఫిర్యాదు చేశాడు. ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్ట‌ర్ ఇలా సైబ‌ర్ నేర‌గాళ్ల చేతిలో మోస‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఇదిలా ఉండ‌గా వెంకీ కుడుముల నాగ‌శౌర్య హీరోగా ఛ‌లో సినిమాను తెర‌క్కెక్కించారు. ఈ సినిమాతో వెంకీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో వెంకీకి ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌చ్చాయి. అయితే ఈ సినిమా స్టోరీ విష‌యంలో కొన్ని వివాదాలను సైతం ఎదురుకున్నాడు. కానీ నితిన్ హీరోగా భీష్మ సినిమాను తెరకెక్కించి మ‌రో హిట్ కొట్టి త‌న స్టామినాన‌ను ప్రూవ్‌ చేసుకున్నారు. భీష్మ విజ‌యంతో ప‌లువురు టాప్ హీరోల‌తో వెంకీ సినిమా అంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు వాటిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: