f2, గద్దలకొండ గణేష్ రెండు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో చేస్తున్నాడు. గని టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడని తెలిసిందే. ఈమధ్యనే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక లేటెస్ట్ గా వరుణ్ తేజ్ తన ఇన్ స్టాగ్రాం లో గని కోసం బాక్సింగ్ ప్రాక్టీస్ లో ఉన్న పిక్ పెట్టాడు.

అసలిపోయి కింద కూర్చున్నట్టుగా వరుణ్ తేజ్ లుక్ ఉంది. ఇన్ స్టాగ్రాం పోస్ట్ లో నెవర్ గివ్ అప్ అంటూ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కు సందేశం ఇస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ అదరగొడతాడని తెలుస్తుంది. సక్సెస్ ఫాం లో ఉన్న వరుణ్ తన సత్తా చాటేలా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎఫ్ 2 సీక్వల్ గా వస్తున్న ఎఫ్ 3 సినిమాను కూడా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

సూపర్ హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవబోతుంది. గనితో మాస్ ఆడియెన్స్ ను.. ఎఫ్ 3తో క్లాస్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాలతో వరుణ్ తేజ్ హిట్ ఫాం కొనసాగించేలా ఉన్నాడని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఎనౌన్స్ చేస్తాడు. ప్రస్తుతానికి రెండు ప్రాజెక్టులు డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి.  
               

మరింత సమాచారం తెలుసుకోండి: