స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమాలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో పుష్ప‌రాజ్ గా న‌టిస్తున్నాడు. గంద‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దాంతో ఎక్కువ శాతం ఈ సినిమా షూటింగ్ ను అడ‌వుల్లోనే చిత్రించారు. దాదాపు సినిమాలోని సంఘం భాగాన్ని మారేడ్ మిల్లి అడ‌వులు, హైద‌రాబాద్‌లో చిత్రించారు. కాగా ప్ర‌స్తుతం మిగ‌తా షూటింగ్ ను త‌మిళ‌నాడులోని టెన్కాసి లో జ‌రుపుతున్నారు. ఇక్క‌డ సినిమాలో ని పుష్ప‌రాజ్ కుటుంబం పై కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ష‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. కాగా బ‌న్నీ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్ ను రిలీజ్ చేసేంద‌కు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంద‌ట ‌.

ఎప్రిల్ 8న అల్లు అర్జున్ బ‌ర్త్ డే కాగా ఆ రోజున టీజ‌ర్ ను రిలీజ్ చేసి అభిమానుల‌కు గిఫ్ట్ ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా విడుద‌ల తేదీని కూడా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించేసింది. ఆగ‌స్ట్ 13న సినిమాను విడుదల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇదివ‌రకు ఎప్పుడూ క‌నిపించ‌ని గెట‌ప్‌లో క‌నిపిస్తుండ‌టం..క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌క్కెక్కుతుండ‌టంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతే కాకుండా అల్లు అర్జున్ తో ఆర్య‌, ఆర్య 2 సినిమాల‌ను తెర‌క్కెక్కించ‌గా ఈ రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. దాంతో ఈ సినిమా కూడా హిట్ అయితే ఇద్ద‌రి కాంబినేష‌న్ లో హాట్రిక్ న‌మోద‌వుతుంది. మ‌‌రి అల్లు అర్జున్ సుక్కు హ్యాట్రిక్ కొడ‌తారా....ఆ అంచ‌నాల‌ను పుష్ప రీచ్ అవుతుందా. లేదా చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: