కొన్ని సినిమాల రిజల్ట్ ముందే తెలిసిపోతుంది. ఆ సినిమాల మేకర్స్ మీద ఉన్న నమ్మకం వల్ల కావచ్చు. ట్రాక్ రికార్డ్ వల్ల కావచ్చు, కాస్టింగ్ వల్ల కావచ్చు. మొత్తానికి సినిమా మీద పెద్ద ఆశలే ముందే పుడతాయ్.  అలా ఎవైటింగ్ మూవీస్ లిస్ట్ లో ఇపుడు  ఉన్నది లవ్ స్టోరీ.

మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. అంటే ఉగాది మరుసటి రోజు అన్న మాట. అచ్చ తెలుగు విందు భోజనంగా ఈ మూవీని రెడీ చేస్తున్నారు అంటున్నారు. ఫిదా తరువాత మూడేళ్ళ పాటు మరే సినిమా జోలికి వెళ్ళని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీ మీద కూర్చున్నారు అంటే ఇంకా ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే లవ్ స్టోరీ గురించి ఇపుడు అంతా మాట్లాడుకుంటున్నారు. అంతే కాదు లవ్ స్టోరీ పాటల గురించి కొరియోగ్రఫీ గురించి. లిరికల్ వాల్యూస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక సారంగధరియా అంటూ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన సాయిపల్లవి సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభించింది. 2021లో ది బెస్ట్ సాంగ్ అని అంటున్నారు. ఫిదా సినిమాలో వచ్చిండే అన్న పాట రేంజీలోనే ఇది కూడా ఉంటుంది అని అంటున్నారు

ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్, సాంగ్స్ సూపర్ అనేస్తున్నారు. ఇక లవ్ స్టోరీ మీద మంచి అంచనాలే ఉన్నాయి. లేకపోతే ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్  మూవీ వకీల్ సాబ్ రిలీజ్ ఉండగా నాలుగు రోజుల తేడాలో ఎందుకు విడుదల చేస్తారు. సరే ఈ బొమ్మ హిట్ అనుకున్నా క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అన్న చర్చ కూడా వస్తోంది. ఇప్పటికే అన్ని రకాల ప్రమోషన్లలో చూసుకుంటే సాయిపల్లవి మీదనే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఇక శేఖర్ కమ్ముల ఎపుడూ ఫిమేల్ ఆర్టిస్టులకే ప్రాధాన్యత ఉండేలా కధ  సెట్ చేసుకుంటారు. దాంతో ఈ మూవీలో అక్కినేని హీరో నాగ చైతన్యకు ఎలాంటి పాత్ర ఉంటుంది. ఆయనకు ఈ విజయంలో ఎంత భాగం ఉంటుంది అన్నది చర్చగా ఉందిపుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: