ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లోని హీరోల్లో వరుణ్ తేజ్ కూడా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్న విషయం తెల్సిందే. ఇటీవల వచ్చిన ఎఫ్ 2, అలానే గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో వరుసగా సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుని కొనసాగుతున్న వరుణ్, ప్రస్తుతం రెండు  సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గని కాగా ఇంకొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 మూవీ. అయితే వీటిలో గని ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకోగా ఎఫ్3 మాత్రం కొన్నాళ్ల క్రితం షూటింగ్ మొదలైంది. 

రెండేళ్ల క్రితం వెంకటేష్ తో కలిసి వరుణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ఎఫ్2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 పై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఎఫ్ 2 ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో ఉంటుందని, తప్పకుండా ఎఫ్3 మరింత పెద్ద సక్సెస్ సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. 

ఇక గని విషయాన్ని వస్తే ఇందులో వరుణ్ ఒక బాక్సర్ పాత్ర చేస్తుండగా సిద్దు ముద్దా, అల్లు బాబీ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మంచి యాక్షన్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు కిరణ్ ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా తీస్తున్నట్లు టాక్. అసలు మ్యాటర్ ఏమిటంటే, కేవలం ఒక నెల గ్యాప్ లో అనగా జులై 30న గని విడుదలవుతుండగా, ఎఫ్ 3 మూవీ ఆగష్టు 27న విడుదలవుతోంది. మొత్తంగా కేవలం ఒక నెల గ్యాప్ లో వరుణ్ వి రెండు సినిమాలు వస్తుండడంతో అవి రెండూ కనుక సూపర్ హిట్ కొడితే హీరోగా వరుణ్ తేజ్ మంచి జాక్ పాట్ కొట్టినట్లే అంటున్నారు విశ్లేషకులు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: