సినిమాలకు మరియు సంక్రాంతికి ఎనలేని సంబంధం ఉంటుంది. ఆ పండుగకి ఏ సినిమా విడుదలైన దాదాపు హిట్ అవుతాయనే చెప్పవచ్చు. కొందరు దర్శకులకి ఆ పండగకి కనుక సినిమా విడుదల చేస్తే విజయం సాదిస్తుందని ఒక నమ్మకం ఉంటుంది. ఒక  దర్శకులకే కాదు హీరోలకి కూడా సంక్రాంతి  పండగ బాగా కలిసి వస్తుంది. గత రెండు సంవత్సరాలలో సంక్రాంతిలో విడుదలైన సినిమాలు కనుక చూస్తే దాదాపుగా అన్ని హిట్ అయ్యాయి. కొన్ని మాత్రం యావరేజ్ తో సరిపెట్టుకున్నాయి.

ముఖ్యంగా ఈ సంక్రాంతికి చూస్తే కరోనా కారణంగా ఒకేసారి  అత్యధిక సినిమాలు విడుదలైయ్యాయి. ఇందులో విజయ్ 'మాస్టర్' సినిమా ఒకటి. ఈసారి సంక్రాంతికి అన్ని సినిమాల మధ్యలోకి ఈ విజయ్ 'మాస్టర్' సినిమా కూడా విడుదల కావడం విశేషం. రవితేజ క్రాక్ నుంచి, రామ్ రెడ్, బెల్లం కొండ అల్లుడు అదుర్స్ మరియు విజయ్ మాస్టర్ సినిమాలు ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే రవితేజ క్రాక్ మంచి విజయాన్ని అందుకోగా మిగతా సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. కారణం ఏంటంటే విజయ్ మాస్టర్ సినిమా రావడం. విజయ్ సినిమా రావడం తో ఈ సినిమా కంటే ముందు ఆ తర్వాత  విడుదలైన మిగతా సినిమాలపై కూడా మాస్టర్ సినిమా ప్రభావం చూపిందని చెప్పవచ్చు.  

విజయ్ కి తమిళ్ లోనే కాకూండా తెలుగులో కూడా లక్షల్లో అభిమానులు ఉన్నారు. అయితే తెలుగులో మాస్టర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిన వసూళ్లను మాత్రం రాబట్టగలిగింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరో సినిమాని విడుదల చేసేందుకు విజయ్ రెడీ  అవుతున్నాడు. తెలుగు టాప్ హీరోల సరసన విజయ్ కూడా సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది కొంచం మన తెలుగు హీరోల సినిమాలకి అడ్డుకట్ట వేసేలా ఉంది కానీ విజయ్ అభిమానులు ఇప్పటినుంచే వచ్చే సంక్రాంతి కూడా తన సినిమాతో విజయ్ ఇండస్ట్రీని షేక్ చేస్తాడని అంటున్నారు.

టాలీవుడ్ లో వచ్చే ఏడాది మొదలు కూడా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి మహా మహా హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఇంతటి రసవత్తర పోరులో విజయ్ సినిమా ఏ విధంగా నిలబడి పోటీని తట్టుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: