ఏడాది పాటు కరోనా వైరస్ కారణంగా  2020 క్యాలండర్ ఇయర్ ఒకటి పూర్తిగా పక్కకు పోయింది. దాంతో షూటింగ్ జరిగిన సినిమాలు, సెట్స్ మీద ఉన్న సినిమాలు అన్నీ కలిపి టాలీవుడ్ లో దాదాపుగా వంద దాకా ఉన్నాయి. ఇందులో చాలా మటుకు వరసపెట్టి రిలీజ్ చేస్తున్నా పెద్ద సినిమాలు, పెద్ద హీరోల మధ్యన మాత్రం ‌ పోటీ తప్పడంలేదు. అలా కనుక చూసుకుంటే మెగాస్టార్ ఆచార్య మూవీకి విక్టరీ వెంకటేష్ నారప్ప మూవీకి మధ్య అతి పెద్ద పోరు జరిగేలా ఉంది.

ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతో రిలీజ్ అవుతున్నాయని ప్రస్తుతానికి వినిపించే టాక్. మే 13న ఆచార్య రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఇక అదే నెల 14వ తేదీకి నారప్ప మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో రెండు భారీ సినిమాలు ఒక రోజు తేడాతో వస్తే రెండింటికీ దెబ్బ అవుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

నారప్పను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ని మొదటే అనౌన్స్ చేశారు. ఆ తరువాత ఆచార్య్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే ఈ రెండూ ఇలా పక్క పక్కన డేట్స్ పడడం పట్ల మాత్రం హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. కానీ ఈ రెండు మూవీస్ ని తీస్తున్న వారు, హీరోలుగా చేస్తున్న వారూ అంతా సన్నిహితులే. మంచి మిత్రులే. అందువల్ల ఆచార్య రిలీజ్ డేట్ మరోటి మార్చుకుంటారా అన్న చర్చ కూడా వస్తోందిట. అదే కనుక జరిగితే ఆచార్య మే 21 కి వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఏ జరుగుతుందో. ఈ డేట్స్ మార్పుల వల్ల మరే సినిమాలకు దెబ్బ పడుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: