పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి చెప్పాలే కానీ ఎన్నో అప్ డేట్స్. ప్రభాస్ ఇపుడు హాట్ ఫేవరేట్ హీరో ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పాలి. బాహుబలి వన్ టూ ఈ రెండూ ప్రభాస్ ని పాన్ ఇండియా హీరోని చేస్తే ఇపుడు హాలీవుడ్ హీరోను చేసేందుకు మరో సినిమా తయారవుతోంది. ప్రభాస్ కొత్త మూవీ కనుక రిలీజ్ అయితే కచ్చితంగా ఆయన అంతర్జాతీయ సినిమా ప్రపంచంతో పోటీ పడతాడు అని అంటున్నారు.

ప్రభాస్ ఇపుడు రాధేశ్యామ్ ముగించేసి సలార్ సెట్స్ మీద ఉన్నాడు. దానితో పాటే ఆదిపురుష్ మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్న ప్రభాస్ కి ఒక బాకీ మాత్రం అలా ఉండిపోయింది. అదే వైజయంతీ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్ మహాటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో తీయబోతున్న సినిమా. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కంటెంట్ తో ఉంటుంది అంటున్నారు. ఈ మూవీకి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయట.

వాటిలో కొన్ని లేటెస్ట్ గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ రివీల్ చేశాడు. ఈ మూవీ కధ ఒక అద్భుతం అని ఊరించాడు. ఈ మూవీతో ప్రభాస్ ఇంటర్నేషనల్ హీరో అవడం ఖాయమని కూడా చెప్పేశాడు. ఇక ఈ సినిమా విషయంలో మరో హైలైట్ ఏంటి అంటే ప్రభాస్ ఇప్పటిదాకా కనిపించని కొత్త లుక్ తో కనిపిస్తాడట. ప్రభాస్ ని ఇప్పటిదాకా ఎవరూ చూడని కొత్త ముఖంతో సరికొత్త గెటప్ తో ఈ మూవీలో చూపించబోతున్నారుట.

ఇక ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఎండింగ్ లో మొదలవుతుంది అంటున్నారు. వచ్చే ఏడాది అంతా షూటింగ్ ఉంటుంది. 2022లోనే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని టాక్. మొత్తానికి ప్రభాస్ ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మరో రెండు సినిమాలు అన్న మాట. రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ గుడ్ న్యూసే.

మరింత సమాచారం తెలుసుకోండి: