తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలాగే హీరోయిన్ గా గుర్తింపు వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆమె ప్రతిధ్వని, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. డైరెక్టర్ T.కృష్ణ డైరెక్షన్ లో విజయశాంతి గారు చాలా సినిమాల్లో నటించారు ఒక విధంగా తనకి నటిగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలన్నీ టి కృష్ణ సినిమాలే. ఇండస్ట్రీలో T.కృష్ణ అంటే విజయశాంతికి ఎనలేని గౌరవం ఉండేది కృష్ణ చనిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆవిడ ఆరోగ్యం కూడా బాగా లేకుండా పోయింది టి.కృష్ణని సొంత ఫాదర్ లా చూసుకునేవారు.

అయితే విజయశాంతి చిరంజీవి తో గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన తర్వాత నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలకృష్ణతో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో ఆటో రాణిగా తన క్యారెక్టర్ కి తగ్గ నటనతో మంచి గుర్తింపును సాధించారు. ప్రసాద్ ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్ పెద్దల్లుడు అయిన గణేష్ రావు స్వయాన మేనల్లుడు.ప్రసాద్ కి బాలకృష్ణ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది ఆ ఫ్రెండ్ షిప్ తోనే బాలకృష్ణ సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేయాలని ప్రసాద్ అనుకొని కోదండరామి రెడ్డి డైరెక్షన్లో వచ్చిన నిప్పురవ్వ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు.

ఆ సినిమాలో హీరోయిన్ గా పలువురు హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ ఫైనల్ గా విజయ శాంతి ని కన్ఫామ్ చేశారు.అప్పుడు విజయశాంతి గారి డేట్స్ కోసం ప్రసాద్ వెళ్ళినప్పుడు విజయశాంతికి ప్రసాద్ కి పరిచయం ఏర్పడింది. అప్పటికే విజయశాంతి వాళ్ళ అమ్మానాన్న చనిపోవడంతో ప్రసాద్ పరిచయం ఫ్రెండ్షిప్ గా మారింది ఎంతలా అంటే ప్రసాద్ విజయశాంతి డేట్స్ చూసుకునేవాడు.అలా ఇద్దరి మధ్య ప్రెండ్ షిప్ కుదిరి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు వీళ్ళ కాపురం సాఫీగానే సాగింది. ప్రస్తుతం ప్రసాద్ ఎక్కడ కనిపించినప్పటికీ విజయశాంతి ప్రసాద్ కలిసి ఉంటున్నారా లేదా అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: