ఫిబ్రవరి 26వ తేదీన చెన్నై సిటీలో ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ తన బాయ్‌ఫ్రెండ్‌ శాంత‌ను హ‌జారికా తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. దీనితో వారి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. చెన్నై సిటీ లో అడుగుపెట్టిన శృతిహాసన్, శాంత‌ను హ‌జారికా కమలహాసన్ ని కూడా కలిశారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ గురించి కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కమల్ హాసన్ తన బిడ్డ శృతిహాసన్ ప్రేమకు అంగీకారం తెలిపారని ప్రచారం జరుగుతోంది.


నిజానికి కమలహాసన్ చాలా ఉదారమైన స్వభావం కలవారు. తన మాటే అందరూ వినాలని.. కఠినంగా వ్యవహరిస్తూ తన కుటుంబ సభ్యుల పై పెత్తనం చెలాయించాలని కమల్ హాసన్ ఎప్పుడూ అనుకోరని సన్నిహితులు చెబుతుంటారు. శృతిహాసన్ కూడా తన తండ్రి గొప్ప మనస్తత్వం గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ తమ కూతుర్ల జీవితంలో జోక్యం చేసుకోకుండా వారికి కావాల్సిన స్వేచ్ఛను ఇస్తారు. ఇదే విషయాన్ని శృతి హాసన్ కూడా ఎన్నోసార్లు వెల్లడించారు.


కానీ తాజాగా శృతిహాసన్, శాంత‌ను హ‌జారికా ప్రేమ పెళ్లి విషయంలో కమల్ హాసన్ జోక్యం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి గురించి ఆలోచించండి అని సున్నితంగా చెప్పారట. ఐతే తన తండ్రి మాటకి గౌరవం ఇచ్చి లైఫ్ లో బాగా సెటిల్ అయిన తర్వాతనే శృతిహాసన్ పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి. 35ఏళ్ల వయసులో కూడా ఆమెకు అనేక సినిమా అవకాశాలు వస్తున్నాయి. గతంలో కూడా ఆమెను ఎన్నో సినీ అవకాశాలు వరించాయి కానీ లండన్ ప్రియుడు మైఖేల్ తో బిజీగా ఉండి తన కెరీర్ ని నిర్లక్ష్యం చేశారు. కానీ ఆమె ఇప్పుడు వరుసగా అవకాశాలను అంది పుచ్చుకుంటూ తన కెరీర్ పై దృష్టి సారించారు. క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న ఆమె ప్రభాస్ తో సలార్, పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: