ఇంటర్నెట్ డెస్క్: సినిమా షూటింగ్‌లు జరిగే సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనేకాసార్లు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్రమాదాల్లో హీరోలు, విలన్లు, ఇతర నటీనటులు చిక్కుకుని గాయాలపాలవుతుంటారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. సీన్‌ను గొప్పగా, రియలిస్టిక్‌గా తీయడం కోసం, ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం దర్శకులు ఎన్నో రకాల క్లిష్టమైన సన్నివేశాలను తెరకెక్కిస్తుంటారు. వాటివల్ల నిర్మాతలకు ఎక్కువ ఖర్చు కావడంతో పాటు నటీనటులూ రిస్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలలోనే కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో షూటింగ్‌లు కూడా ఆగిపోతుంటాయి.

తాజాగా ఓ కన్నడ చిత్రం షూటింగ్‌లో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఆ ప్రమాదంలో ఏకంగా హీరోనే గాయపడడం సంచలనంగా మారింది. కన్నడ సినీ పరిశ్రమ నటుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ హాసన్ జిల్లా బేలూరులో జరుగుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ‘హీరో’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో అడవిలో జరిగే ఓ సన్నివేశంలో ఓ ప్రమాదకరమైన బాంబ్ బ్లాస్ట్‌లో నటించాల్సి వచ్చింది.

సన్నివేశం ప్రమాదకరంగా ఉన్నా.. డూప్ లేకుండా తానే చేసేందుకు హీరో రిషబ్ శెట్టి ప్రయత్నించాడు. ప్రత్యర్థులు హీరోపై పెట్రోల్ బాంబును విసిరేసే సన్నివేశంలో గానావి లక్ష్మణతో కలిసి హీరో పారిపోవాలి. ఈ సన్నివేశంలో బాంబు పేలుడు కొంత ఎక్కువగా ఉండడం, వారు సరైన సమయంలో పరిగెత్తకపోవడంతో ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. దీంతో హుటాహుటిన అక్కడి సిబబ్ంది వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఘటనలో రిషబ్ శెట్టి కొద్దిగా పెద్ద గాయాలే అయ్యాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా మంచి గుర్తింపు పొందాడు. ఉత్తమ దర్శకుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2013లో నటుడిగా పరిచయమై.. వరుసగా ఎన్నో సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నాడు. అదే తరహాలో దర్శకుడిగా కూడా ఎదిగాడు. అంతేకాకుండా అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. గతేడాది ఏకంగా 8 సినిమాలకు రిషబ్ శెట్టి ఓకే చెప్పాడంటే ఇక ఆయన స్పీడ్ ఏంటో అర్థం చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: