సినీ పరిశ్రమ లో షూటింగ్ సమయం లో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలు ఉండటం తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం దర్శక నిర్మాతలు ఎన్నో రకాల క్లిష్టమైన సన్నివేశాలను చేస్తుంటారు . అలాంటి సమయంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తాజగా కన్నడ సినిమా షూటింగ్‌‌లో భాగంగా కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండ గా అనుకోకుండా హీరో రిషబ్ శెట్టికి గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తోన్న షూటింగ్‌లో పెట్రోల్ బాంబులు వేయాల్సిన సన్నివేశాలున్నాయి. స్క్రిప్ట్ ప్రకారం షూటింగ్‌లో ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అయితే అందులో భాగంగా హీరో రిషబ్‌తో పాటు మరో నటుడు లక్ష్మణ్ పెట్రో బాంబులు విసిరి పారిపోవాల్సిన సన్నివేశాలను షూట్ చేయాలి. కానీ ఈ సీన్‌లొ వారు పరిగెత్తే లోపే పెట్రో బాంబులు పేలాయి. దీంతో షూటింగ్‌లో హీరో రిషబ్‌తో పాటు మరో నటుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కర్ణాటక పోలీసులు సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్‌కు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారనే విషయమై వివరాలు వాకబు చేస్తున్నారు. మొత్తంగా ఈ పెట్రో బాంబు ఘటన కన్నడ సినీ ఇండస్ట్రీలో  చర్చనియాంశమైంది.

అయితే ఈ మధ్యకాలంలో రిస్కీ స్టంట్‌లను డూప్స్‌కు బదులు హీరోలే చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.  మన తెలుగు హీరోలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇబ్బందులు ఎదుర్కున్నారు. శర్వానంద్, మంచు విష్ణు, సందీప్ కిషన్, వంటివారు ఈ మధ్యకాలంలో స్టంట్స్ చేస్తూ గాయపడ్డారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యారు. కాగా ఇటువంటి రిస్కీ సంట్స్ చేసే సమయంలో అనుభవం ఉన్న స్టంట్ మాస్టర్లను డూప్‌లుగా పెట్టుకుంటే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: