నటి హేమ టాలీవుడ్ సినిమాలలో కమెడియన్ ఆర్టిస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు ఘడించింది.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మేల్ కమెడియన్ లతో పోలిస్తే ఫీమేల్ కమెడియన్ల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే.. అయితే మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా కోవై సరళ లాంటి గొప్ప ఫీమేల్ కమెడియన్ మన సినీ ఇండస్ట్రీలో ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక అంతే స్థాయిలో నటి హేమ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇటీవల ఈమె ఆలీతో సరదాగా షో కు హాజరయ్యింది.


అంతేకాకుండా ప్రముఖ నటి శ్రీలక్ష్మి తో కలిసి,హేమ ఆ షో కు హాజరు కావడం గమనార్హం. ఇక హేమ  ఆ షో లో ఆలీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ.. సినిమాల గురించి, సినీ ఇండస్ట్రీలో  జరిగే  పలు విషయాల గురించి, అలాగే ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చింది.. ఈ భాగంలోనే తన చిన్నప్పటి విషయాలను కూడా ఆలీతో పాటు ప్రేక్షకులతో కూడా  పంచుకుంది.


ఈమె తూర్పుగోదావరి జిల్లా రాజోలు జిల్లాకు చెందినది. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతనే తన పేరు హేమ గా మారిందని ఆమె అన్నారు. అంతే కాకుండా తన కుటుంబంలో తన అందరికంటే చిన్నది అని కూడా ఆమె చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండేదాని నని, ఎవరైనా వెకిలి వేషాలు వేస్తే కొట్టేదాన్ని అని, అలా కొట్టడం వల్ల చేతికి వేసిన మట్టి గాజులు పగిలి పోతూ ఉండడంతో చివరికి చేసేది లేక అమ్మ ఇనుప గాజులు కొని పెట్టిందని ఆమె చెప్పుకొచ్చింది.


బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన భలే దొంగ సినిమా ద్వారా  చైల్డ్ ఆర్టిస్ట్ గా  సినీ రంగ ప్రవేశం చేసారు . ఆ సినిమాలో రావు గోపాలరావు కి కూతురిగా నటించింది . ఆ సినిమా హిట్ అవడంతో పది సినిమాలలో నటించడానికి ఆఫర్లు వచ్చాయి. అలా తనకు ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఒకసారి కొయ్యబొమ్మలా బిగుసుకు పోవడంతో అందరు చనిపోయింది అనుకుని బయట పడుకోబెట్టారు..
అమ్మ వాళ్లు ఏడుస్తూ.. నాన్న ఇంటికి వచ్చి,ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే నాన్నకు ఇద్దరు భార్యలు.. నేను రెండో భార్య సంతానం. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ గారు నన్ను కామెడియన్ రోల్స్ చేయమని సలహా ఇవ్వడంతో  "అతడు" సినిమా ద్వారా నా సెకండ్ ఇన్నింగ్స్ ను  స్టార్ట్ చేశాను అని ఆమె చెప్పుకొచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: