సోషల్ మీడియా తో సెలబ్రెటీ స్టేటస్ సంపాదించిన బ్యూటీ అష్షు రెడ్డి. ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మడి ఫోటోలు సేమ్ సమంత లా ఉండటం తో జూనియర్ సమంత గా తెగ పాపులర్ అయ్యింది. దాంతో లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ అమ్మడు చేసే టిక్ టాక్ వీడియో లకు కూడా ఎంతో మంది అభిమానులు అయ్యారు. ఇంకేముంది ఈ పాపులారిటీ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ ఫైనల్స్ లో ఉండలేకపోయినా...ముక్కుసూటి తత్వం తో అష్షు రెడ్డి ప్రేక్షకుల మనసు దోచుకుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఈ అమ్మడి ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. దాంతో బుల్లితెరపై పలు టీవి షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అంతే కాకుండా ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా అష్షు రెడ్డి పవన్ కళ్యాణ్ పక్కన ఓ సినిమాలో నటిస్తోంది. పవన్ కు పెద్ద అభిమాని అయిన అష్షు పవన్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఫుల్ ఖుషీ అవుతోంది. కాగా తాజాగా పవన్ అష్షు రెడ్డి కి ఓ లేఖ రాయడంతో ఈ అమ్మకి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ లేఖలో "అష్షు రెడ్డి గారికి మీరు కోరుకుంటునవన్ని మీ జీవితంలో జరగాలని కోరుకుటున్నా" అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బ్యూటీ...నా దేవుడిని మళ్ళీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఆయన నాకు టీ ఇప్పించారు. నా టాటూ గురించి ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా రెండు గంటలు ఇద్దరం మాట్లాడుకున్నాం. వెళ్లి పోయే ముందు ఒక స్వీట్ లెటర్ ను కూడా ఇచ్చారు. ఆయనే ఎప్పటికీ నా ఫస్ట్ లవ్" అంటూ పేర్కొంది. అయితే ఈ పోస్ట్ కు ఓ నెటిజెన్..మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ కు నాలుగో భార్యగా ఉంటారా అనింప్రశ్నించగా...ఎస్ (ఉంటాను) అంటూ సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: