పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న వకీల్ సాబ్ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు . పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు.అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ సంక్రాంతి కి విడుదలై యూట్యూబ్ రికార్డ్స్ సృష్టించింది. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ టీజర్ విడుదల కావడంతో ఆయన అభిమానులు ఈ టీజర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మూవీ టీం మొదలుపెట్టింది. ఇక మార్చి 3 న ఈ సినిమాలోని రెండవ పాట సత్యమేవ జయతే సాంగ్ విడుదల కాబోతుంది.ఈ పాట కోసం ఆయన అభిమానులు బాగా ఎదురుచూస్తున్నారు.  హిందీలో విడుదలై సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి , నివేత తమోస్ , శ్రుతి హస్సన్ కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ని బోనీ కపూర్ , దిల్ రాజు కలిసి భారీ గా నిర్మిస్తున్నారు. నాని తో ఎంసిఎ సినిమా తీసిన శ్రీరామ్ వేణు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ని ఒక ప్రముఖ ఓటిటి సంస్థ విడుదల తర్వాత స్ట్రీమింగ్ హక్కులు సంపాదించుకుంది. అదేదో కాదు అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ స్ట్రీమింగ్ సంస్థ వకీల్ సాబ్ ని 50 కోట్లకు కొనుకుంది. అయితే ఒక రీమేక్ సినిమాని ఇంత రేంజ్ లో కొన్నారు అంటే మాములు విషయం కాదు. ఏప్రిల్ విడుదల కాబోతున్న ఈ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: