ఇప్పటికి రెండు సంవత్సరాలు క్రితం ఓరు ఆడార్ లవ్ టీజర్ తో ఇండియా అంత ఒక ఊపు ఉపేసిన ప్రియ ప్రకాష్ వారియర్ అందరికి గుర్తుండే ఉంటది. ఈ సినిమాలో తాను మెయిన్ హీరోయిన్ కాకపోయినా ఈ సినిమాతో మాత్రం ప్రియ ప్రకాష్ మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది.  ఈ సినిమా టీజర్ అప్పట్లోనే 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక మలయాళం సినిమాకి ఇన్ని వ్యూస్ రావడం ఇప్పటిదాకా ఎప్పుడు లేదు. ఓరు ఆడార్ లవ్ సినిమాని తెలుగు లోకి కూడా లవర్స్ డే గా డబ్బింగ్ చేశారు . ఈ సినిమా రిలీస్ కి ముందు చాలా హైప్ వచ్చిన ఒక్కసారి రిలీస్ ఐయ్యాక మాత్రం గోరా పరాజయం అందుకుంది. తెలుగులోనే కాదు మలయాళం లో కూడా ఇదే పరిస్థితి. ఈ సినిమా టీజర్ చూసి అందరూ ప్రియ ప్రకాష్ కి చాలా ఛాన్స్ లు వస్తాయి అని అందరూ అనుకుంటే దానికి తలకిందులు గా తనకి సినిమా తర్వాత అనుకున్నంత రేంజ్ లో మాత్రం ఛాన్సులు రాలేదు. ఈ సినిమా తర్వాత శ్రీదేవి బంగ్లా అని ఇంకో సినిమా చేసిన ఈ సినిమా కూడా ముందు చాలా గొడవలు అయిన రిలీస్ తర్వాత మాత్రం ఎలాంటి ప్రభావం లేదు. ఇలా కెరీర్ చాలా డల్ గా నడుస్తున్న ప్రియ ప్రకాష్ వారియర్ కి  తెలుగులో చంద్ర శేఖర్ యేలేటి , నితిన్ కాంబినేషన్ లో వచ్చిన చెక్ సినిమా చేసే అవకాశం వచ్చింది.  ఈ సినిమా తో అయిన తెలుగులో అవకాశాలు వస్తాయి అని ఈ భామ ఆశ పడింది. అయితే ఈ సినిమా ప్లాప్ టాక్ తో నడుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రియ ప్రకాష్ క్యారెక్టర్ కూడా అంతలా గుర్తుపెట్టుకునేల కూడా ఏమి లేదు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: