తనదైన స్టైల్ లో కూల్ గా ప్రేమ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను తన మాయలో పడేయటంలో దిట్ట డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. ఈయన సినిమా అంటే యూత్ లో బాగా క్రేజ్. ఇప్పటికే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు.ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ .కరోన లాక్డౌన్ వల్ల 2020లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 2021 లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ పోస్టర్స్ మరియు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు పవన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది . ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ టీం త్వరలోనే సినిమాని విడుదల చేయడానికి చూస్తున్నారు. ఇక ఈ సినిమా బిసినెస్ కూడా దాదాపుగా అయిపోయింది అని టాక్. లవ్ స్టొరీ సినిమాని అన్ని చోట్లా కలిపి దాదాపుగా 50 కోట్ల వరకు బిసినెస్ జరిగింది అని అనుకుంటున్నారు.ఈ సినిమా మీద అంచనాలు అన్ని  ఫిబ్రవరి 26 న సమంత చేతుల మీదగా సరంగా దరియా  పాట మార్చేసింది. అప్పటిదాకా లవ్ స్టొరీ మీద ఉన్న టాక్ అంత ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో అందరిలోనూ ఉత్సాహం నింపింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఒక్క రోజుల్లోనే ఈ పాట కి దాదాపుగా 7 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ లవ్ స్టొరీ కూడా శేఖర్ కమ్ముల గత ప్రేమ కథ సినిమల్లగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: