ఎన్నో అంచనాలు మధ్య, వైష్ణవ్ తేజ్ నటిస్తున్న  ఉప్పెన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ప్రేక్షకులు, మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను అయితే వైష్ణవ్ అందుకున్నాడు. తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు.ఏ డెబ్యూ హీరో కి సాధ్యం కానీ కలెక్షన్లను వైష్ణవ్ సాధించాడు. మొదటి సినిమా తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించాడంటే ఫ్యూచర్ లో పెద్ద హీరోలకు పోటీ అవడం ఖాయం అని తెలుస్తుంది.. ముఖ్యంగా తన నటన తో వైష్ణవ్ మెగా ఫ్యాన్స్ నే కాకుండా నార్మల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు.. ఎక్స్ ప్రెషన్ లో వేరియేషన్స్ చూపించి వైష్ణవ్ అందరి వద్ద మార్కులు కొట్టేశాడు. అంతేకాకుండా వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై ముందునుంచి మంచి అంచనాలు ఉన్నాయి..ఇకపోతే ఈ సినిమా లోని హీరోయిన్ గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి.. తొలి సినిమా నే అయినా కృతి శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది..

ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన అదరగొట్టింది.. ఆమె నటన చూసిన ఎవరైనాఆమెది ఫస్ట్ సినిమా అంటే నమ్మరు.. సినిమా మొత్తం ఆమె మీద ఉండడంతో వైష్ణవ్ కంటే రెండు మార్కులు ఎక్కువే కొట్టేసింది.. ఈ నేపథ్యంలో సినిమా హిట్ కి తలా చెయ్యి వేసి అదరగొట్టారు. సినిమా సూపర్ హిట్ కావడంతో ఇతర భాషల నిర్మాతల కన్ను ఈ సినిమా పై పడ్డాయి.. దాంతో తమిళ్లో ఈ సినిమా ను రీమేక్ చేయాలనీ చూస్తున్నారు.. ముఖ్యంగా ఒక స్టార్ హీరో తనయుడు ఉప్పెన ద్వారా పరిచయం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కథ పాయింట్ చాలా వరకు ఇది వరకు వచ్చిన సైరాత్ మూవీ నుండి తీసుకున్నారు అని చాలా మంది అనుకున్నారు,

కానీ అది కొంచమే కరెక్ట్ అని, అసలు కథ పాయింట్ ని ఓ హాలీవుడ్ మూవీ నుండి స్పూర్తి పొంది రాసుకున్నారు అంటూ ఇప్పుడు టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.వివరాల్లోకి వెళితే… సినిమా కథ పాయింట్ మొత్తం కూడా 2017 లో హాలీవుడ్ లో వచ్చిన ‘మడ్ బౌండ్’ అనే అమెరికన్ మూవీ నుండి తీసుకున్నారని తెలుస్తుంది. ఒక నవల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా కథ పాయింట్ కూడా ఇలానే ఉంటుంది కానీ…అక్కడ కథ ఎప్పటి నుండో చరిత్రలో ఉన్న తెల్ల జాతీయులు మరియు నల్ల జాతీయుల మధ్య గొడవ గా చూపెట్టారు…ఎనిమిది దశాబ్దాల క్రితం మిసిసిపి ప్రాంతంలో తెలుపు నలుపు జాతీయుల మధ అంతర్యుద్ధం నేపధ్యంగా తీసుకుని ఈ ప్రేమకథను రూపొందించారు. కాకపోతే ఇందులో బ్లాక్ హీరోకి వైట్ హీరోయిన్ కి కొడుకు పుడతాడు. ఆ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళు హీరో మ్యాన్ హుడ్ ని కోసేస్తారు….అదే కథ పాయింట్ ని తీసుకుని పల్లెటూరి నేపధ్యంలో మార్చుకుని ఇప్పుడు ఉప్పెన సినిమా వచ్చింది అంటున్నారు. ఇక్కడ పిల్లల టాపిక్ లేకుండా….కథ మెయిన్ ట్విస్ట్ సేం అయినా ఇక్కడ ట్రీట్ మెంట్ కంప్లీట్ గా ఆకట్టుకునే విధంగా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండగా ఉప్పెన బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకుని సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది…





మరింత సమాచారం తెలుసుకోండి: