కేవలం రెండు రోజుల్లో కోటి వ్యూస్ అందుకున్న సారంగదారియా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలుస్తుంది. సాయి పల్లవి నర్తించిన ఈ పాట విశేషంగా యూత్ ని ఆకట్టుకుంటుంది. మంగ్లీ పాడిన ఈ పాటకు పవన్ సంగీతం అందించగా ఈ పాటకు ఫుల్ ఫిదా అయిపోతున్నారు విన్న ప్రేక్షకులు.. వివరాల్లోకి వెళితే అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి కథానాయికగా లవ్ స్టోరీ అనే సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే..

సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఓ సాంగ్ లో యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంటుండగా తాజాగా రిలీజ్ అయిన  'దాని పేరే సారంగదరియా..' అనే పాట అంతకు మించి సూపర్ అయ్యింది. ఈ పాటలో  సాయిపల్లవి డ్యాన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని సినిమా రిలీజ్‌ అయ్యే ఏప్రిల్‌ 16 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ ‘సారంగ దరియా’ పాటను ఆలపించింది మంగ్లీనే అయినా.. ఈ జానపద పాట గతంలోనే ఎంతోమంది పల్లె గాయనిల గొంతు నుంచి జాలువారింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది మనసులను ఇప్పుడు కొల్లగొట్టిన ఈ ‘సారంగ దరియా’ పాట వెనుక ఆసక్తికరమైన కథే ఉంది. ఈ పాటకు తొలుత 2010లో ‘రేలా రే రేలా’ అనే జానపద పాటల కార్యక్రమంతో ఆదరణ దక్కింది. ఆ ప్రోగ్రాంలో ‘సారంగ దరియా’ పాటను పాడిన జానపద గాయని పేరు కోమల. అప్పట్లో ఈమె పాడిన ఈ పాట పల్లె జనాల హృదయాలను గెలుచుకుంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ‘సారంగ దరియా’ పాట సినిమా ద్వారా ఇంత ఆదరణ దక్కించుకోవడంపై ఆ పాట పాడిన కోమల స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: