ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు.దర్శకధీరుడు రాజమౌళి తెరాకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా తరువాత విడుదల అయిన ‘సాహో’ సినిమా ప్లాప్ అయినప్పటికీ బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ని రాబట్టిందంటే అది కేవలం ప్రభాస్ క్రేజ్ వలెనేనని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు ఈ హీరోతో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా ప్రభాస్ డేట్స్ కోసం చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేస్తున్నాడు. అలానే లైన్ లో ‘సలార్’, ‘ఆదిపురుష్’ లాంటి సినిమాలు ఉన్నాయి. అలానే నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నాడు.ప్రభాస్ అన్నీ కూడా పాన్ ఇండియా కథలనే ఎన్నుకుంటున్నాడు. దానికి తగ్గట్లుగా మార్కెట్ జరగడం కోసం ఇతర భాషల నటీనటులను కూడా ప్రభాస్ సినిమాల్లో తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.


టాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా దాదాపు అన్ని ఇండస్ట్రీలలో నటీనటులు ప్రభాస్ సినిమాల్లో కనిపిస్తున్నారు. కానీ కోలీవుడ్ మాత్రం ప్రభాస్ సినిమాలను ప్రోత్సహించడం లేదని తెలుస్తోంది. విజయ్ సేతుపతి లాంటి స్టార్లకు ప్రభాస్ సినిమాల్లో ఛాన్స్ వస్తే చేయొద్దని అక్కడ ఇండస్ట్రీ పెద్దలు సలహాలు ఇస్తున్నారట.ఇక ఈ మధ్య కోలీవుడ్ యంగ్ హీరో అధర్వకి రెబల్ స్టార్ సినిమాలో నటించే అవకాశం రాగా.. ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయమంటూ కోలీవుడ్ దర్శకనిర్మాతలు కొందరు ఈ యంగ్ హీరోకి చెబుతున్నారట. తమ ఇండస్ట్రీకి చెందిన హీరోలు ప్రభాస్ సినిమాల్లో నటించకూడదంటూ రూల్స్ కూడా పెట్టుకుంటున్నారట.


కానీ ఈ విషయాలను బయటకి రానివ్వకుండా పైకి మాత్రం ప్రభాస్ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సూపర్ స్టార్స్ అంటే కోలీవుడ్ హీరోల గురించే చెప్పుకునేవారని.. కానీ ఈ జెనరేషన్ లో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదగడం కోలీవుడ్ సినిమా పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. ప్రభాస్ కి వున్న క్రేజ్ ని చూసి వారు తెగ అసూయపడుతున్నారు... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: