మలయాళ భామ సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. తొలి సినిమా ఫిదా కంటే ముందే ఆమె తన మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెలుగునాట దక్కించుకోవడం సాయి పల్లవి కి ఒక్కదానికే చెందింది.. ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది.. ఫిదా తో ఒక్కసారిగా కుర్రకారు గుండెలని కొల్లగొట్టిన సాయి పల్లవి ఆ తర్వాత నాని సరసన MCA చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆమె లవ్ స్టోరీ సినిమా లో నటిస్తుంది..

అంతేకాకుండా ఆమెకు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్లకు బ్రేక్‌ పడింది. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన నటించేందుకు సాయి పల్లవి నో చెప్పినట్లు సమాచారం.వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె పవన్‌ సినిమాకు డేట్స్‌ కేటాయించడం కష్టమని ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. పైగా తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందని ఆమె భావించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ భారీ ప్రాజెక్ట్‌ నుంచి సాయిపల్లవి తప్పుకోవడం కొంత నిరాశ కలిగించే విషయం.

ఇక ఆమె వైదొలగడంతో దర్శకనిర్మాతలు మరో హీరోయిన్‌ కోసం వెతుకులాట ప్రారంభించారంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రానాతో ‘విరాటపర్వం’, నానితో ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సినిమాలు చేస్తుంది సాయి పల్లవి..   తాజాగా రిలీజ్ అయిన  'దాని పేరే సారంగదరియా..' అనే పాట సూపర్ అయ్యింది. ఈ పాటలో  సాయిపల్లవి డ్యాన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని సినిమా రిలీజ్‌ అయ్యే ఏప్రిల్‌ 16 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: