టాలీవుడ్ లో అనతికాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మూడు సినిమాలు హిట్లతో తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. విజయ్ సినిమా వస్తుంది అంటే యూత్ ఆడియెన్స్ అంతా ఎగబడేలా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ చివరి రెండు సినిమాలు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పూరీ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు.

సినిమాలో హీరోయిన్ గా అనన్యా పాండే నటిస్తుంది. సినిమాను ఈ ఇయర్ సెప్టెంబర్ 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. హిందీలో ఒక్క సినిమా చేయకపోయినా సరే అక్కడ కూడా విజయ్ విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. అందుకే అక్కడ హీరోయిన్స్ అంతా విజయ్ పేరు ప్రస్థావిస్తూ అతన్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇప్పటికే జాన్వి కపూర్ ఛాన్స్ వస్తే విజయ్ తో చేసేందుకు రెడీ అని చెప్పగా.. అలియా భట్ కూడా రౌడీ హీరోకి ఇంప్రెస్ అయ్యింది. ఇక ఆ లిస్ట్ లో ఇప్పుడు సారా ఆలి ఖాన్ చేరింది. విజయ్ నటన తనకు చాలా ఇష్టమని.. తన సెన్సాఫ్ హ్యూమర్ కూడా బాగుంటుందని.. అతనితో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా అంటుంది అమ్మడు.

విజయ్ దేవరకొండ బాలీవుడ్ డెబ్యూ మూవీగా లైగర్ వస్తుంది. డ్యాషింగ్ హీరో.. డేరింగ్ డైరక్టర్ ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా ట్యాగ్ లైగ్ సాలా క్రాస్ బ్రీడ్ అంటూ మాస కా బాప్ అనిపించేలా పెట్టారు. మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ కొడితే మాత్రం బాలీవుడ్ లో చక్రం తిప్పడం ఖాయమని చెప్పొచ్చు. తెలుగు యువ హీరోకి హిందీలో ఈ క్రేజ్ రావడం ఓ విధంగా విజయ్ లక్కీ అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: