మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కాగా మరొకటి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్న ఆచార్య మూవీ. కొరటాల శివ తీస్తున్న ఈ సినిమా ద్వారా తొలిసారిగా తండ్రి చిరంజీవి తో కలిసి నటిస్తున్న చరణ్, ఆయన తో ఈ విధంగా ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోనుండడం నిజంగా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని ఇటీవల ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్, సిద్ద అనే కామ్రేడ్ పాత్ర చేస్తున్నారు.

సినిమా మే 13న రిలీజ్ కానుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలతో ఎంతో లాంఛనంగా ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్, వివి వినాయక్, బండ్ల గణేష్ వంటి చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు విచ్చేసిన ఈ మూవీ, హఠాత్తుగా ప్రారంభోత్సవం తరువాత ఆగిపోయింది. 

వాస్తవానికి అంతకముందు చరణ్ కి ఒక కథ వినిపంచిన కొరటాల, ఆపై దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి చరణ్ కి వినిపించారట, అయితే అది అంతగా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో చరణ్ ఆ మూవీ ని చేయలేను అంటూ ప్రక్కన పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక మళ్ళి ఇన్నేళ్ల తరువాత ఫైనల్ గా కొరటాలతో పని చేసే ఛాన్స్ చరణ్ కి దక్కింది. ఇక ప్రస్తుతం చేస్తున్న ఆచార్య లో చరణ్ ది హీరో రోల్ కానప్పటికీ తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో పాటు చరణ్ ఈ సినిమాలో దాదాపుగా ఇరవై నిమిషాలకు పైగా కనిపిస్తారని అంటున్నారు. తొలిసారిగా మెగా ఫాథర్ అండ్ సన్ నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: