ఎట్టకేలకు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ పట్టు నిలుపుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక అసెంబ్లీ స్థానానికి బీజేపీ పోటీ చేస్తుందా లేక జనసేన పోటీ చేస్తున్న అనే అంశం చాలా రోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది. నిజానికి రెండు పార్టీల వాళ్ళు తమ పార్టీనే ఈ ఎన్నికలలో పోటీ చేస్తుందని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ విషయం మీద సరైన క్లారిటీ ఎవరి దగ్గరా లేదు. అయితే సౌత్ ఇండియన్ సీఎంల సమావేశం కోసం అమిత్ షా తిరుపతి రావాల్సి ఉంది. 4,5 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని భావించారు. 

అమిత్ షా తిరుపతి వస్తే పవన్ కళ్యాణ్ కూడా ఆయనను తిరుపతిలో కలిసి ఈ ఎన్నికలకు సంబంధించిన చర్చలు జరపాలని భావించారు. అయితే అనూహ్యంగా ఈ సమావేశం వాయిదా పడిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సినిమా షూటింగ్ విషయంలో బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా షూటింగ్ మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. నిజానికి ఈ మున్సిపల్ ఎన్నికలు ఒకపక్క అలాగే ఉప ఎన్నికకు సంబంధించిన చర్చలు జరపాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్ ఇచ్చారు.

కానీ అనుకున్నంత మేర మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన తరపున ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆయన ఉప ఎన్నికకు సంబంధించిన చర్చలు జరపాలని భావించారు. అది కూడా కుదిరే పరిస్థితి లేకపోవడంతో చివరి నిమిషంలో నిన్న షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న మలయాళం సూపర్ హిట్ సినిమా రీమేక్ లో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ లోనే ఆయన పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ కథ స్క్రీన్ ప్లే అందిస్తుండగా దర్శకుడు సహకరించేందుకు దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: