కన్నడ భామ కృతి శెట్టి మొదటి సినిమా ఉప్పెనతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి తొలి సినిమాతోనే స్టార్స్ గా ఎదిగారు.

ఉప్పెన హిట్ అవడంతో కృతి శెట్టికి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలతో కృతి శెట్టి మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. సుధీర్ బాబుతో చేస్తున్న సినిమాలో ఆమె పాత్ర పక్కా హైదరాబాదీ అమ్మాయి అని తెలుస్తుంది. తెలంగాణా యాసలో పాత్ర మాట్లాడాల్సి ఉంటుందట. అందుకే ఆమె ఈ యాస నేర్చుకుంటుంది. ఉప్పెన కోసం తెలుగు నేర్చుకున్న కృతి శెట్టి సుధీర్ బాబు సినిమా కోసం తెలంగాణా యాసని నేర్చేసుకుంటుంది.

సినిమా మీద తనకున్న కమిట్మెంట్ ఏంటన్నది ఆమె నేర్చుకుంటున్న విధానం చూస్తే తెలుస్తుంది. కృతి శెట్టి తప్పకుండా తెలుగులో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదహరణ మరోటి లేదని చెప్పాలి. అమ్మడు అంత కష్టపడుతుంది కాబట్టే ఆమెను మొదటి సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ బాగా ఇష్టపడ్డారు. చూస్తుంటే రెండు మూడు సినిమాలతోనే కృతి శెట్టికి అభిమాన సంఘాలు.. భారీ ఫాలోయింగ్ ఏర్పడుతుందని ఫిక్స్ అవ్వొచ్చు. తెలుగులో స్టార్ గా ఎదిగితే తమిళ భాషలో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: