ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వీటికి బలవుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రజలను మభ్య పెడుతూ కొన్ని కొన్ని మోసాలను చాలా సులువుగా చేస్తున్నారు. తాజాగా ఒక ఆశ్చర్యకర మోసం జరిగింది. కాని సినీ దర్శకుడు అలెర్ట్ అయ్యారు. నిన్న భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనికి డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్పొరేషన్ నుండి ఫోన్ చేస్తున్నట్లు నవీన్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడి ఆయనను నమ్మించే ప్రయత్నం చేసాడు.

 అతను నిర్మించిన భీష్మ చిత్రం ఆరు క్యాటగిరీలలో అవార్డ్స్ కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని... ఒక్కో క్యాటగిరికి 10600 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అది నమ్మిన దర్శకుడు ఆరు క్యాటగిరీలకు గాను 63000 నగదును అతను చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. మరల అదే వ్యక్తి కాల్ చేసి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా అమౌంట్ డిపాజిట్ కాలేదని... మరోసారి 63000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. అతనికి అనుమానం రావడం తో  ప్రొడ్యూసర్ తో మాట్లాడి చేస్తానని సమాధానం ఇచ్చారు.

ఆరు క్యాటగిరికి లకు కాకున్నా మూడు లేదా ఒక క్యాటగిరీ లకైనా అమౌంట్ పంపాలని అడగడంతో దీనితో మోసపోయానని గ్రహించిన దర్శకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సైబర్ క్రైమ్స్ ఏసీపీ కెవిఎం ప్రసాద్ మీడియా కు వివరించారు. సినిమా అవార్డ్స్ కోసం సైబర్ నేరగాళ్లు మోసం చేయడం ఇదే మొదటి కేసు అని ఆయన వివరించారు. ఇక దర్శకుడు వేసిన సొమ్ము ఏ ఖాతాలో డిపాజిట్ అయిందో తెలుసుకుని నిందితుడు ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: