టాలీవుడ్ బడా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ పై మన తెలుగు తో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అంతకముందు బాహుబలి రెండు భాగాల ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం హాలీవుడ్ రేంజ్ కి పెంచిన దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న సినిమా కావడం, అలానే మెగా, నందమూరి ఫ్యామిలీ లోని యువ స్టార్ హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో తప్పకుండా ఈ మూవీ మరొక సెన్సేషనల్ సక్సెస్ కావడం ఖాయం అని పలువురు ఆడియన్స్ భావిస్తున్నారు.

సినిమా లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు హీరోలిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ ఎంతో భారీ ఎత్తున జరుగుతోంది. 

కాగా అసలు మ్యాటర్ ఏమిటంటే హాలీవుడ్ కి చెందిన ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఈ మూవీ యొక్క క్లైమాక్స్ కి పని చేస్తున్నారని కొద్దిసేపటి క్రితం ఆర్ఆర్ఆర్ యూనిట్ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. గతంలో గ్లాడియేటర్, బార్న్ ఐడెంటిటీ వంటి హాలీవుడ్ సినిమాలతో పాటు మణికర్ణిక వంటి బాలీవుడ్ సినిమాకి పని చేసిన నిక్ ఈ మూవీలో పాలు పంచుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని యూనిట్ అంటోంది. మొత్తంగా నిక్ పావెల్ ఎంట్రీ తో ఆర్ఆర్ఆర్ యొక్క రేంజ్ మరింతగా పెరిగిందని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: