దగ్గుబాటి రానా సురేష్ బాబు కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా అందరి అటెన్షన్ తన వైపుకు తిప్పుకున్నాడు. అయితే అప్పటి నుంచి వివాదాలకు తావివ్వకుండా మల్టీస్టారర్స్ అలాగే సింగిల్ హీరోగా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన తమ్ముడు అభిరామ్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వకుండానే అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన తమను వాడుకుని ఇబ్బందులపాలు చేశాడంటూ పెద్ద ఎత్తున మీడియాలో రచ్చ చేశారు. 

అయితే ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడు అంటూ గత 2,3 ఏళ్లుగా అడపాదడపా ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే అలా ప్రచారం జరగడమే తప్ప ఇప్పటిదాకా ఆయనకు సంబంధించిన సినిమా అప్డేట్స్ ఏవీ అఫీషియల్గా వెలువడలేదు..అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన మొదటి సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దం అయ్యిందని అంటున్నారు. విచిత్రమైన సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న రవిబాబు ఆయనతో మొదటి సినిమా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 

ఒకరకంగా రవిబాబు తీసే అన్ని సినిమాలను సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా రవిబాబుకి ఆయన అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మరి ఆ కృతజ్ఞతతో చేశాడో లేక నిజంగానే అభిరామ్ కి తగ్గ స్క్రిప్ట్ అని ఆయనను ఎంచుకున్నాడు తెలియదు కానీ ఇప్పటికే కథ పూర్తయిందని సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం మాత్రమే బాకీ ఉందని ప్రచారం మొదలైంది. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: