‘ఉప్పెన’ మూవీతో సుకుమార్ కు కోట్లల్లో లాభాలు వచ్చిన ఆనందం అతడిలో పెద్దగా కనిపించడం లేదు అని అంటున్నారు. దీనికికారణం సుకుమార్  ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ అని టాక్. ఈ సినిమా విడుదల డేట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం సుకుమార్ కు నచ్చలేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తిన్నాయి.  


అంతేకాదు ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించే ముందు సుకుమార్ ను ఈ మూవీ నిర్మాతలు ఒక్క మాట కూడ అడగకుండా అల్లు అర్జున్ సలహాతో ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఈ మూవీ నిర్మాతలు ప్రకటించారు అని అంటారు. దీనితో సుకుమార్ గతంలో మాదిరిగా కాకుండా ఈసారి నాన్ స్టాప్ గా అసలు గ్యాప్ తీసుకోకుండా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి మారేడిమిల్లి షూటింగ్ తరువాత కేరళ  వైపు పరుగులు తీసాడు.


అక్కడ నుంచి తమిళనాడు వైపు తన యూనిట్ ను తీసుకు వెళ్ళబోతున్నాడు ఆతరువాత హైదరాబాద్ లోని ఒక లగ్జరీ హౌస్ లో షూట్ చేయపోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం పెద్దపెద్ద సినిమాలు అన్నీ తమ డేట్ లు ప్రకటిస్తున్నాయి. దీనితో ‘పుష్ప’ మూవీ ఆగస్టు డేట్ ను వదలుకుంటే సమస్యలు ఎదురౌతాయి.


ఇలాంటి పరిస్థితులలో ‘పుష్ప’ విషయంలో సుకుమార్ పై ఒత్తిడి పరోక్షంగా పెంచడానికి బన్నీ తన తరువాత సినిమా విడుదల డేట్ ను కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. బన్నీ ‘పుష్ప’ మూవీ తరువాత కొరటాల శివ డైరక్షన్ లో మూవీ చేయవలసి ఉంది.  వాస్తవానికి ఈ సినిమాకు స్టొరీ లైన్ ఫైనల్ కాలేదు. అయినప్పటికీ సుకుమార్ పై ఒత్తిడి పెంచడానికి ముందు జాగ్రత్తగా కొరటాల మూవీని 2022 సమ్మర్ విడుదల అని ప్రకటిస్తారని తెలుస్తోంది. దీనితో సుకుమార్ కు ‘పుష్ప’ విషయంలో పరుగులు తీయడం తప్ప మరో మార్గం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: