తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగ్రేటం చేసిన అల్లు అర్జున్ వరుస సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ఓ వైపు అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించడంతో దాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పాన్ ఇండియన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు బన్నీ.

ప్రస్తుతం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన ఏరియాలో భారీగా ఖర్చు చేసి ఈ ఆఫీస్ నిర్మిస్తున్నట్లు సమాచారం. దీనికోసం భారీగానే కోట్లు కుమ్మరిస్తున్నాడు అల్లు వారబ్బాయి. ఈ ఆఫీస్ ముందు ఏ కార్పోరేట్ ఆఫీస్ కూడా నిలవబోదని ప్రచారం జరుగుతుంది. కాస్ట్ లీ డెకార్స్‌తో పాటు ఖరీదైన ఇంటీరియర్ కూడా తెప్పిస్తున్నాడు బన్నీ. తెలుగు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకు ఇంత భారీగా కార్పోరేట్ తరహాలో ఆఫీస్ ఉండటం ఇదే తొలిసారి. ఇందులో ఫ్యాన్స్, విజిటర్స్ కూర్చోడానికి వాళ్లతో సంభాషించడానికి వీలుగా భారీ కార్యాలయాలు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు.. గీతా ఆర్ట్స్‌కు సంబంధించిన ఫోటోలతో పాటు బన్నీ సినిమాల పోస్టర్స్ కూడా అక్కడుంటాయన్నారు. దానికి తోడు ఎండోర్స్‌మెంట్ కోసం కూడా అక్కడే ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే కార్పోరేట్ కార్యాలయం తరహాలో ఉండే ఈ ఆఫీస్‌లోనే బన్నీ అన్ని చర్చలు చేస్తాడంటున్నారు సన్నిహితులు. అందులో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుకోడానికి ఓ గదిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నాడు బన్నీ. ఇక వచ్చిన వాళ్లకు పార్కింగ్ ఏరియా కూడా భారీగానే ఉండబోతుంది. ఎక్కువ సంఖ్యలో కార్స్, బైక్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. బన్నీ న్యూ ఆఫీస్ త్వరలోనే ఓపెన్ కానున్నట్లు తెలుస్తుంది. సినిమాల విషయానికి వస్తే సుకుమార్‌తో పుష్ప అయిన వెంటనే కొరటాల శివతో సినిమా మొదలు పెట్టనున్నాడు బన్నీ. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: