బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’.భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మధ్యన ఈ ఆర్ఆర్ఆర్ టీం ఈ సినిమా గురించి అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడూ ఇస్తూ వస్తోంది. ఇక తాజాగా కూడా ఓ అదిరిపోయే అప్ డేట్ ను అందించింది.
ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కు సంబంధించిన ఓ విషయాన్ని సోషల్ మీడియా వేధికగా తెలియజేసింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ క్లైమాక్స్ కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ పావెల్ ఆర్ఆర్ఆర్ టీం లో జాయిన అయ్యారని తెలిపింది జక్కన్న టీం. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ గురించి ఎలాంటి అప్ డేట్ రావడం లేదని భావించిన వారి కోసం ఒక అప్డేట్ ఇస్తున్నాం.. ఈ క్లైమాక్స్ కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ సెట్ లోకి అడుగుపెట్టారంటూ... అంటూ ఆర్ఆర్ఆర్  టీం సోషల్ మీడియా వేధికగా వీడియోను షేర్ చేసింది. అందులో రాజమౌళి, నిక్ పావెల్ లాప్ టాప్ ముందు కూర్చొని క్లైమాక్స్ సీన్ గురించి చర్చిస్తున్నారు.

అయితే ఈ క్లైమాక్స్ కోసం నిక్ భారీ ప్లాన్సే వేసినట్టు తెలుస్తోంది. నిక్ పావెల్ తో జక్కన్న ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ సీన్స్ ను భారీ రేంజ్ లోనే ఏర్పాట్లు చేయనున్నట్టు తెలుస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటిస్తున్నారు. ఇక వీరి సరసన హాలీవుడ్ భామ్ ఒలీవియా మోరిస్... బాలీవుడ్ సుందరి ఆలియా భట్ లు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటుగా ఈ సినిమాలో కీలక పాత్రలో అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, శ్రియా లు కనపించనున్నారు. ఇక ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: