వరలక్ష్మీ శరత్ కుమార్.. ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ విలన్‏గా మారిపోయింది. ఇక వరలక్ష్మీ డేట్స్ కోసం దర్శకనిర్మాతలను ఆమెను ఫాలో అయిపోతున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చి రవితేజ 'క్రాక్' సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో జయమ్మగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే విడుదలైన అల్లరి నరేష్ 'నాంది' సినిమాలోనూ ఆద్య పాత్రలో సూపర్ అనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్‏లో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా వరలక్ష్మీకి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లుగా ఫీల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.

సక్కెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ.. తన తర్వాతి చిత్రం స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్‏తో కలిసి నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమచారం ప్రకారం వరలక్ష్మీ అందులో ఓ పవర్ ఫుల్ పాత్రలోకి తీసుకునేందుకు కొరటాల శివ భావిస్తున్నట్లుగా టాక్. అయితే వీరిద్ధరి కాంబోలో రాబోయే సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో రాబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్లో చర్చలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమా తెరకెక్కిస్తున్నాడు.

 ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటంది. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజహెగ్డె కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్‏తో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కొరటాల శివ, బన్నీ కాంబినేషన్‏లో రానున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా.. వరలక్ష్మీ.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. అక్కినేని అఖిల్ కాంబోలో రాబోతున్న సినిమా వరలక్ష్మీ నెగిటివల్ రోల్ చేయబోతున్నట్లుగా కొద్ధి రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.  మొత్తానికి ఈ అమ్మడు మరిన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. మరీ కొరటాల శివ, బన్నీ కాంబోలో రాబోయే సినిమాలో వరలక్ష్మీ మరోసారి తన విలనిజాన్ని చూపించబోతుందా లేదా అనేది చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: