చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకు హీరో హీరోయిన్స్ చాల రకాల డ్రెస్సులు వేసుకుంటారు. అయితే వాళ్ళు వేసుకున్న డ్రెస్సులను ఏం చేస్తుంటారు అనే డౌట్ అందరికి వస్తూనే ఉంటాది కదా. ఇక అంతకుముందు హీరో హీరోయిన్ ల కోసం ఎంత ఖరీదు పెట్టి కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసే వాళ్ళు. కొంతమంది యాక్టర్లకి వాళ్లకు ఏమైనా డ్రస్సులు నచ్చితే వాళ్ళతో పాటే తీసుకెళ్ళిపోతారు. ఇంకొంతమంది చారిటీ లో ఈ డ్రెస్సులను వేలం వేస్తారు.

అయితే దూకుడు సినిమా కోసం మహేష్ బాబు కి, సమంతకి ప్రత్యేకంగా కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. సినిమా అయిపోయిన తర్వాత సమంత ఆ సినిమాలో మహేష్ బాబు వాడిన కాస్ట్యూమ్స్ ని వేలం వేసి వచ్చిన డబ్బులను చారిటీకి ఉపయోగించింది. అంతేకాకుండా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన పోలీస్ కాస్ట్యూమ్ కూడా ఒక స్వచ్ఛంద సంస్థ కు సహాయం చేయడం కోసం వేలం వేసింది.

ఇక అల వైకుంఠపురంలో సినిమా లో రాములో రాముల పాట లో పూజా హెగ్డే వేసుకున్న డ్రస్సు అలా అద్దెకి తీసుకున్నదే. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆ డ్రెస్ ను డిజైన్ చేస్తే, ఆ సినిమా కి పూజా హెగ్డే కి స్టైలిస్ట్ గా చేసిన అశ్విన్ మావ్లే ఆ డ్రెస్సు ను సెలెక్ట్ చేసి రెంట్ కి తీసుకువచ్చి మళ్లీ డ్రెస్సు కి ఏమీ కాకుండా తిరిచ్చేసే బాధ్యతను మొత్తం చూసుకున్నారు.

అంతేకాదు.. బృందావనం సినిమాలో కాజల్ వేసుకున్న ఒక డ్రెస్సు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఒక పాటలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ కి ఉంటుంది. ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ దిల్ రాజు. అదే కాకుండా రారండోయ్ వేడుక చూద్దాం లో రకుల్ వేసుకున్న డ్రస్సు ఒకటి రంగులరాట్నం సినిమా లో హీరోయిన్ ఒక పాటలో వేసుకుంటుంది. హీరోల విషయానికి వస్తే వాళ్లు వేసుకునేవి దాదాపు బ్రాండెడ్ దుస్తులే. అవి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ బాబు వేసుకున్న దుస్తులన్నీ తన సొంత బ్రాండ్ అయిన హంబుల్ అండ్ కో లోవి.

మరింత సమాచారం తెలుసుకోండి: