ఇంటర్నెట్ డెస్క్: గోవాబ్యూటీ ఇలియానా తన కొత్త బాయ్‌ఫ్రెండ్ గురించి బయటపెట్టింది. తన ఇన్‌స్టాగ్రాంలో ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. పాత బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిన తరువాత ఇలియానా మళ్లీ లవ్‌లో ఉన్నానని ఆ పోస్ట్‌లో చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్ గురించి బయటపెట్టింది. అయితే అసలు విషయం తెలిసి తెగ నవ్వుకుంటున్నారు.  ఇంతకీ ఇలియానా బాయ్ ఫ్రెడ్ ఎవరో తెలుసా..? ఓ శునకం.

ఇంతకుముందు ప్రేమ విషయాన్ని సీక్రెట్‌‌గా ఉంచిన ఈ బ్యూటీ బాగా దెబ్బతిన్నది. ఆ ప్రేమ కోసం సినిమా అవకాశాలను కూడా వదులుకుంది. కానీ చివరికి ఆ ప్రేమ విఫలమైంది. దీంతో ఇలియానా చాలా బాధపడింది. కానీ ఇప్పుడు మరొకరితో ప్రేమలో ఉన్నానంటూ బహిరంగంగానే చెప్తూ ఓ ఫోటోను కూడా షేర్ చేసింది.

తాజాగా 'ఆస్క్‌మీ ఎనీథింగ్‌' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించింది. ఈ చాట్‌లో ఓ నెటిజన్‌ ఇలియానాను 'మీ కొత్త బాయ్‌ఫ్రెండ్‌ పేరేమిటి?' అని అడిగాడు. దానికి సమాధానంగా ఇలియానా తను పెంచుకుంటున్న కుక్కను చూపించింది. వీడి పేరు చార్లి అని బదులిచ్చింది. ఇంతకు ముందు అండ్రూని ప్రేమించిన ఇలియానా, ప్రేమ మైకంలో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. లవ్‌ బ్రేకప్‌ తర్వాత ఇప్పుడిప్పుడే కెరీర్‌ మీద మళ్లీ ఫోకస్‌ పెడుతోంది. ప్రస్తుతం అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ, ది బిగ్‌ బుల్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
     
ఇదిలా ఉంటే ఇలియానా కొత్త లవర్ గురించి పోస్ట్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘మనుషలను ప్రేమిస్తే మోసపోతామని అనుకుందో ఏమో కానీ.. తాను పెంచుకుంటున్న కుక్కను లవ్ చేస్తోందంటూ.. ఒకరు కామెంట్ చేస్తే.. నిజమే మనుషులకంటే కుక్కలే బెటర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: