సుద్దాల అశోక్ తేజ ఈ పాటల రచయిత అందరికి సుపరిచితమే, విప్లవ గీతాలు, జానపద గీతాలకు సుద్దాల పెట్టింది పేరు. ఇటీవలే యూట్యూబ్ లో విడుదలైన 'సారంగా దరియా' అనే పాటను రాసింది ఈయనే. ఆ పాట తెగ వైరల్ కావడం విశేషం.నల్గొండ జిల్లాలో పుట్టిన సుద్దాల అశోక్ తేజ  తేజ చిన్నప్పటి నుంచే పాటలు రాయడం అలవాటుగా ఉండేదట.ఆలా ఉన్నత చదువులు చదివి టీచర్ వృత్తిని చేపట్టారు సుద్దాల అశోక్ తేజ.

అయితే ఓ సందర్భం లో ప్రముఖ రచయిత తనికెళ్ళ భరణి తేజ ని సినిమాల్లోకి రావాలని సిఫారసు చేసారు. అయన కోరిక మేరకు సినిమాల్లోకి ప్రవేశించిన సుద్దాల అశోక్ తేజ మెల్లిగా సినిమా పాటలను రాయడం మొదలుపెట్టారు. ఆలా ఠాగూర్ సినిమాకి గాను అయన రాసిన 'నేను సైతం' పాటకి బెస్ట్ లిరిసిస్ట్స్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ పాట వింటే కూడా అంతే గొప్పగా ఉంటుంది.

సుమారు వెయ్యికి పైగా సినిమా పాటలు అతడి కలం నుండి జాలు వారాయి. ఈ క్రమంలో ఇంద్ర సినిమాలో అతడు 'నెమలి కన్నులొడ నమిలే చూపోడ' అంటూ సాగే ఒక పాటని రాసిన తేజసినిమా విడుదలైయ్యాగా ఆ పాట లేకపోవడం చూసి చాలా బాధ పడ్డారు. అయితే ఈ పాట అందరికి నచ్చగా డైరెక్టర్ గోపాల్ కి నచ్చలేదు. దీంతో ఆ పాటను సినిమాలోంచి తీసివేశారు. అయితే ఈ విషయం సుద్దాల కి తెలియకపోవడం తో సినిమా విడుదల అయ్యాక తెలిసి బాధపడ్డారు.

అయితే ఓ సందర్భం లో దర్శకేంద్రులు రాఘవేంద్రరావు తాను తీస్తున్న సినిమా అయిన  ''ఒకటో నెంబర్ కుర్రాడు' కోసం ఒక పాటని సుద్దాల అశోక్ తేజ ని అడగగా దానికి  సుద్దాల అశోక్ తేజ ఆ పాటని ఇచ్చారట. సినిమాకి ఆ పాట బాగా సెట్ కావడంతో దర్శకేంద్రులు తన సినిమాలో ఆ పాటని వాడారు. ఆలా ఇంద్ర కోసం రాసిన పాటని ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాలో వాడడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: