జబర్దస్త్ నుండి బిగ్ బాస్ కు వెళ్లిన మొదటి కంటెస్టంట్ అవినాష్. ఈటివి జబర్దస్త్ నుండి స్టార్ మా బిగ్ బాస్ కు ఇంతకుముందు చాలామందికి ఆఫర్స్ వచ్చినా వారు మాత్రం నో అని చెప్పారు. అయితే అవినాష్ ఆర్ధిక పరిస్థితి బాగాలేక స్టార్ మా ఇచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ మిస్ చేసుకోవడం ఇష్టం లేక అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అవినాష్ హౌజ్ లో అరియానాకు బాగా దగ్గరయ్యాడు.

అవినాష్, అరియానాల జంట బాగా అలరించింది. అయితే అవినాష్ చివరి మూడవ వారం ఎలిమినేట్ అవగా టాప్ 5లో స్థానం సంపాదించుకుంది అరియానా. అయితే హౌజ్ లో వీరి ఫ్రెండ్ షిప్ బాగా కుదిరింది. బయటకు వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈమధ్య స్టార్ మాలో ఏ షో చూసినా వీరిద్దరు కనిపిస్తున్నారు. అవినాష్ ఎక్కడ ఉంటే అరియానా అక్కడ ఉంటుంది. అరియానా ఏ షోకి వెళ్తే అవినాష్ ఆ షోకి వెళ్తున్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

అంతేకాదు అవినాస్, అరియానాల కమిస్ట్రీ చూసి వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందని కొందరు డౌట్ పడుతున్నారు. స్టార్ మా కామెడీ స్టార్స్ లో అవినాష్ టీం కు సపోర్ట్ గా అరియానా, సోహెల్ వచ్చారు. అయితే సోహెల్ తో అరియానా డ్యాన్స్ చేస్తుంటే అవినాష్ సీరియస్ గా చూస్తూ ఓ ప్రోమో వదిలారు. అరియానా తనతోనే డ్యాన్స్ చేయాలని అనుకుంటూ అవినాష్ సోహెల్ మీద సీరియస్ గా చూస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా అవినాష్, అరియానా ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనేది మాత్రం నిజమే అనిపిస్తుంది. మరి ఈ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది అన్నది వారే చెప్పాలి.      

మరింత సమాచారం తెలుసుకోండి: