ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ఉన్న టాప్ హీరోల సినిమాలు ఏ హీరోయిన్ కి లేవనే చెప్పాలి. మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటూ స్టార్ హీరోల సినిమా ల్లో పూజ హెగ్డే నటిస్తుండగా, ఆమె మధ్య మధ్య లో అభిమానులను ఖుషి చేస్తుంది కూడా.. ఆమధ్య బ్లూ బికినీ లో హాట్ హాట్ గా కనిపించి అందరిని కవ్వించినా ఈ సన్నని భామ తరచు తన అందాల విందును రుచి చూపించింది. సోషల్ మీడియా లోనే కాకుద్నాఈవెంట్ కి వచ్చినా పూజ అందాల కనువిందు చేస్తుంది..

ప్రస్తుతం అందరి పెద్ద హీరోలకు ఇప్పుడు పూజాహెగ్డే నే కావాలి. ఆమె సినిమాలో ఉంటే సూపర్ హిట్.. తొలుత మాములు సినిమాలే చేసిన పూజాహెగ్డే  కి ఒక్కసారిగా ఇంత పెద్ద డిమాండ్ ఏర్పడడానికి కారణం ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ కావడం..పెద్ద హీరోలే కాకుండా చిన్న హీరో లు కూడా ఆమెతో సినిమా చేయాలనీ వెయిట్ చేస్తున్నారు. ఒక లైలా కోసం సినిమా తో ప్రేక్షకులకు పరిచమైన పూజ ఆ తర్వాత అనుకున్నంత అవకాశాలు రాలేదు.రెండో సినిమా ఒకలైలా కోసం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది..దాంతో బాలీవుడ్ కి చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ మంచి మంచి అవకాశాలను రాబట్టుకుంది.. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి దువ్వాడ జగన్నాథం సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పూజ ఇక వెనుతిరిగి చూసుకోలేదు.

ఈ ఏడాది పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదల కానుండగా కొత్త సినిమాలకు సంబంధించి త్వరలో ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.ఇక ఆమె పర్సనల్ విషయాలకి వస్తే  పూజాహెగ్డే తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు.అయితే ముంబైలో పూజా హెగ్డే తల్లిదండ్రులు స్థిరపడగా పూజా హెగ్డే ముంబైలోనే చదువుకున్నారు.పూజా తల్లి పేరు లతా హెగ్డే కాగా తండ్రి పేరు మంజునాథ్ హెగ్డే.పూజా హెగ్డే తండ్రి లాయర్ కాగా ఆమె తల్లి ఇమ్యూనాలజిస్ట్ అని తెలుస్తోంది.పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే డాక్టర్.పూజా హెగ్డే తల్లిదండ్రులు, సోదరునితో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.









మరింత సమాచారం తెలుసుకోండి: