సోహెల్ గతంలో పలు సినిమాలు మరియు సీరియల్స్ లో  నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ... తనకి సరైన బ్రేక్ లభించలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడో ఇక అప్పటి నుండి తన దైన శైలిలో హౌస్ లో నడుచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సోహెల్. ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ తో తన క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. చికెన్ చికెన్ ... మటన్ చికెన్ అంటూ తెలుగు ప్రేక్షకులను మరింత మురిపించాడు. తన తండ్రి ఆకాంక్ష అదే విధంగా తన లక్ష్యం మంచి హీరో గా ఎదగడమే అన్న సోహెల్... మొత్తానికి తన ఈ కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.  

జార్జిరెడ్డి నిర్మాణ సంస్థతో సోహెల్ ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వలన మొన్నటి వరకు సెట్స్ పైకి వెళ్ళని ఈ సినిమా...నిన్నటి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. సోహెల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో సోహెల్ ఫుల్ మాస్ లుక్ తో దర్శనమిచ్చాడు. ఓ చేతిలో సిగరెట్టు పట్టుకొని.. ఒళ్లంతా టాటూలతో పక్కా మాస్ గెటప్ లో కనిపించాడు సోహెల్.

ఈ లుక్ లో సోహెల్ వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ లా కనిపిస్తున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు అర్జున్ రెడ్డి సినిమా తరహాలో ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుంది అంటూ ఊహించుకుంటున్నారు. ఇలా ఇన్ని అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం సోహెల్ కు మంచి సక్సెస్ ఇవ్వనుందని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. సోహెల్ కూడా ఈ సినిమా తనకి మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు. మరి ఏమి జరగనుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: